ఆ సమయంలో ఐపీఎల్ రద్దు సరైన నిర్ణయమే: కేన్ విలియమ్సన్‌

ఈ సంవత్సరం ఐపీఎల్ సగం షెడ్యూల్ పూర్తి చేసుకున్న తర్వాత నిరవధిక వాయిదా పడిన సంగతి అందరికి తెలిసిందే.అయితే ఈ నిర్ణయాన్ని మంచి నిర్ణయమే అని తాజాగా న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ పేర్కొన్నాడు.

 Nz Captain Kane Willamson About Ipl 2021 Schedule Postpone , Kane Williamson, Te-TeluguStop.com

అయితే ఇలా జరగడానికి ప్రధాన కారణం.బయో బబుల్ లో జరిగిన అతిక్రమణలు వల్లనే ఈ తప్పు జరిగిందని అతడు తెలియజేశాడు.

ఇకపోతే 2021 లో జరిగిన ఐపీఎల్ 14 సీజన్ లో పాయింట్ల పట్టికలో కేన్ విలియమ్సన్ ప్రాతినిధ్యం వహిస్తున్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కేవలం రెండు పాయింట్లతో పాయింట్ల పట్టికలో చిట్ట చివరన ఉంది.

తాజాగా కేన్ విలియమ్సన్ ఐపీఎల్ గురించి మాట్లాడుతూ.

ప్రస్తుతం భారతదేశంలో కరోనా మహమ్మారి సృష్టించిన విలయం గుండెల్ని పిండేసింది అని తెలియజేశాడు.ఐపీఎల్ జరుగుతున్న సమయంలో మొదటగా బయో బుడగలో అంత బాగానే అనిపించిందని.

కాకపోతే, టోర్నీ ముందుకు వెళుతున్న కొద్దీ బయో బబుల్ లో కొన్ని అతిక్రమణలో చోటు చేసుకోవడం వల్లే ఈ పరిస్థితి ఎదురైందని తెలియజేశాడు.ముఖ్యంగా ఆటగాళ్లకి పాజిటివ్ కేసులు రావడంతో.

అలాంటి సమయంలో ఐపీఎల్ లీగ్ ను కొనసాగించడం కష్టం కష్టమని అయితే టోర్నీ మధ్యలోని ఆపాలని తీసుకున్న నిర్ణయం సరైన నిర్ణయమని ఆయన చెప్పుకొచ్చాడు.

ఇకపోతే జూన్ 18న ఇంగ్లాండ్ లో ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ లో భాగంగా ఫైనల్ లో న్యూజిలాండ్ జట్టు కెప్టెన్ గా విలియంసన్ సారథ్యంలో టీమిండియాతో తలపడనుంది.

అయితే ఈ టెస్ట్ మ్యాచ్ జరగకముందే న్యూజిలాండ్ జట్టు ఇంగ్లాండ్ జట్టుతో రెండు టెస్ట్ మ్యాచ్లను ఆడబోతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube