నువ్వుంటే నా జతగా ట్రైలర్ టాక్: ప్రేమ బాధను ఇస్తుంది.. బలాన్ని ఇస్తుంది!

టాలీవుడ్‌లో ఎన్నో ప్రేమకథా చిత్రాలు వచ్చాయి.ఒక్కో ప్రేమకథా చిత్రం ప్రేక్షకులను మెప్పించి తనదైన మార్క్ వేసుకునేందుకు ప్రయత్నించాయి.

 Nuvvunte Naa Jathaga Trailer Impressive, Nuvvunte Naa Jathaga, Srikanth Biroju,-TeluguStop.com

అయితే కొన్ని లవ్ స్టోరి చిత్రాలు ప్రేక్షకులను మెప్పించడంలో విజయాన్ని అందుకున్నా, బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ సక్సెస్ కాలేకపోయాయి.దీంతో లవ్ స్టోరి చిత్రాలను తెరకెక్కించాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారు దర్శకనిర్మాతలు.

కానీ అవేమీ ఆలోచించకుండా తాజాగా ఓ ప్రేమకథా చిత్రం ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యింది.

నువ్వుంటే నా జతగా’ అనే టైటిల్‌తో వస్తున్న ఈ బ్యూటీఫుల్ ఎమోషనల్ లవ్ స్టోరిని దర్శకుడు సంజయ్ కర్లపూడి డైరెక్ట్ చేస్తున్నాడు.

ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను చిత్ర యూనిట్ తాజాగా రిలీజ్ చేశారు.ఈ ట్రైలర్ చూస్తుంటే సగటు ప్రేక్షకుడికి ఇదొక రొటీన్ లవ్‌స్టోరీలాగే కనిపిస్తుంది.కానీ ఈ సినిమాను ఎమోషనల్‌గా కనెక్ట్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నించినట్లు మనకు ఈ ట్రైలర్ చూస్తూ అర్థం అవుతుంది.ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకుని, పెళ్లి చేసుకున్న ఓ జంట ఆ తరువాత ఎలాంటి పరిస్థితులను, సమస్యలను ఎదుర్కొన్నారు, వారి జీవితంలో పెళ్లి తరువాత ప్రేమ ఉందా లేదా అనే కాన్సెప్ట్ కొత్తగా చూపించే ప్రయత్నం చేశారు ఈ చిత్ర యూనిట్.

ప్రేమ బాధను ఇస్తుంది.ప్రేమ బలాన్ని ఇస్తుంది అనే ట్యాగ్‌లైన్‌తో మనకు ఈ సినిమా కథను ఏ విధంగా చూపించబోతున్నారో చిత్ర యూనిట్ చెప్పేసింది.ఇక ఈ సినిమాలో శ్రీకాంత్ బిరొజు, గీతికా రతన్ హీరోహీరోయిన్లుగా నటించగా, వారి పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో ఈ ట్రైలర్‌లో మనకు శాంపిల్ చూపించారు.కాగా ఈ సినిమాకు సంగీతం ‘జాను’ చిత్ర సంగీత దర్శకుడు గోవింద్ వసంత అందిస్తున్నారు.

ఈ ట్రైలర్ బీజీఎం ఎమెషనల్‌గా మనసుల్ని హత్తుకునేలా ఉండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట అవుతున్నాయి.మరి ట్రైలర్‌తో మెప్పించిన ఈ లవ్‌స్టోరి థియేటర్ ఆడియెన్స్‌ను ఎంతమేర మెప్పిస్తుందో చూడాలి.

ఈ బ్యూటీఫుల్ లవ్‌స్టోరికి సంబంధించిన ట్రైలర్‌ను మీరూ ఓసారి చూసేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube