నువ్వే కావాలి సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన ముద్దుగుమ్మ రిచా పల్లోడ్.1991లో చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ ప్రారంభించి రీచా.తెలుగు, తమిళ్, హిందీ సినిమాల్లో హీరోయిన్ గా తన అందం అభినయంతో ఆకట్టుకుంది.తన 16వ ఏట మోడలింగ్ లోకి అడుగుపెట్టి సుమారు 500కి పైగా కమర్షియల్ లో యాక్ట్ చేసింది.
తొలిసారి 2000సంత్సరంలో రిచా నువ్వే కావాలి సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది.
మలయాళ సినిమా రీమేక్ గా తెలుగులో విడుదలైన స్క్రీన్ ప్లే, డైలాగ్స్ తో ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసింది.
ముఖ్యంగా సినిమాలో రిచా, హీరో తరుణ్ నటన అభిమానుల్ని ఆకట్టుకుంది. రిచాకు సైతం తొలి సినిమాతో హింది, తమిళ్, మలయాళం సినిమాల్లో వరుస ఆఫర్లను దక్కించుకుంది.
టాలీవుడ్ , కోలీవుడ్ సినిమాలు చేసింది.

కోలీవుడ్ సినిమాలు తరువాత బాలీవుడ్ లోకి అడుగుపెట్టడంతో ఆమె కెరియర్ అయోమయంలో పడిపోయింది.కుచ్ తుమ్ కహో కుచ్ హమ్ కహీన్ సినిమాతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఆమెకు అపజయాలే స్వాగతం పలికాయి.హీరోయిన్ గా అడుగు పెట్టినా యాక్ట్ చేసిన ఆమెకు ప్రమోషన్ లేకపోవడంతో అంతగా ఆకట్టుకోలేకపోయింది.
ఇలా రెండు సంవత్సరాల పాటు ఫెయిల్యూర్ తో డిప్రెషన్ కు గురైంది.
హిందీలో అవకాశాలు రాక కన్నడలో చెప్పాలే, జూతటా అనే సినిమాలు చేసింది అక్కడే ఆమెను దురదృష్టం వెంటాడింది.
మళ్లీ ఆఫర్లకోసం బాలీవుడ్ కు చెక్కేసింది.యాష్ రాజ్ నిర్మాణంలో పలు సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా చేసిన అనుకున్నంతగా ఆకట్టుకోలేకపోయింది.
దీంతో కుచ్ తుమ్ కహో కుచ్ హమ్ కహీన్ హీరో, బిజినెస్ మ్యాగ్నేట్ ఫర్దీన్ ఖాన్ తో వివాహం చేసుకొని సెటిల్ అయినట్లు తెలుస్తోంది.ప్రస్తుతం రిచా పల్లోడ్ కి ఒక బాబు కూడా ఉన్నాడు.
రిచా పల్లోడ్ తన భర్తకు సాయంగా ఉంటూ కుటుంబ బాధ్యతలను చక్కబెట్టుకునే పనిలో పడింది.