అతి త్వరలో బౌలింగ్ చేయడానికి సిద్ధమవుతున్న అంటున్న నట్టూ..!

ఐపీఎల్ -14 సీజన్ లో ఆడుతుండగా టీమిండియా పేసర్, యార్కర్ కింగ్ టి.నటరాజన్ గాయపడిన విషయం తెలిసిందే.

 Nuttu Says He Is Preparing To Bowl Very Soon  Bowling, T Natarajan, Fitness Vido-TeluguStop.com

నటరాజన్ ఇప్పుడు క్రమంగా కోలుకుంటున్నాడు.రోజురోజుకు ధృఢంగా తయారవుతున్నానంటూ తన ఫిట్ నెస్ కు సంబంధించిన వీడియోను ఆయన సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.

ఐపీఎల్ 14 సీజన్ ఆరంభంలోనే నటరాజన్ మోకాలికి గాయం అయ్యింది.దీంతో అతడు ఆ సీజన్ కు దూరమయ్యాడు.

వైద్యులు నటరాజన్ మోకాలికి సర్జరీ చేశారు.అతడిని ఇంట్లోనే విశ్రాంతి తీసుకోవాలన్నారు.దీంతో నటరాజన్ ఇంట్లోనే ఉంటూ.ఫిట్ నెస్ పై ఫోకస్ పెట్టాడు.ఎక్సర్ సైజ్ చేస్తున్న వీడియోను పోస్ట్ చేస్తూ రీహాబ్‌, ప్రొగ్రెస్‌ అనే రెండు హ్యాష్‌ట్యాగ్‌లను యాడ్ చేశాడు.22 యార్డులున్న పిచ్‌పై బౌలింగ్‌ చేయడానికి త్వరలోనే వస్తానని ఈ సందర్భంగా నటరాజన్ వెల్లడించాడు.మోకాలి సర్జరీ సక్సెస్ అయ్యిందని, అందరి ఆశీర్వాదాలతో త్వరగా కోలుకుంటున్నట్లు నటరాజన్ తెలిపాడు.తనపై అభిమానానికి, ఆదరణకు.అలాగే కష్టకాలంలో మద్దతుగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు అంటూ నటరాజన్ పేర్కొన్నాడు.

ఐపీఎల్ 2020 లో సన్ రైజర్స్ తరపున ఆడిన నటరాజన్యా ర్కర్లు వేయడంలో తన ప్రత్యేకత ఏంటో.డెత్ ఓవర్లలో ఎంత బౌలింగ్ చేయగలడో నిరూపించుకున్నాడు.ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో అద్బుత ప్రదర్శన కనబరిచాడు.

టీ 20 కోసం వెళ్లి వన్డే, టెస్ట్ సిరీసుల్లోనూ ఆడాడు.ఆఖరి టెస్టు మ్యాచ్‌లో 3 వికెట్లు పడగొట్టాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube