భారత సంతతి మహిళకు వరల్డ్ ఫుడ్ ప్రైజ్...ఇది నోబెల్ తో సమానం...!!

ప్రపంచ ఆహార బహుమతి (వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ) ప్రతీ ఏటా ఇచ్చే ఈ బహుమతిని అత్యంత ప్రతిష్టాత్మక అవార్డ్ గా పరిగణిస్తారు.అంతేకాదు ఆహార, ఆరోగ్య రంగానికి ఇచ్చే ఈ బహుమతిని నోబెల్ తో సమానంగా పరిగణిస్తారు కూడా.

 Indian Origin Shakuntala Haraksingh Won World Food Prize-2021, World Food Prize--TeluguStop.com

అంతటి విలువైన ఈ బహుమతి ప్రధానం 1987 లో మొదలయ్యింది.ఆహారపు అలవాట్లు, పోషకాలు, మారుతున్న కాలానికి తగ్గట్టుగా ఆహార నియమాల మార్పు తడిరత అంశాలపై విశేష కృషి చేసిన వారికి ఈ ఫుడ్ ప్రైజ్ అందిస్తారు.

అయితే ఈ సంస్థను స్థాపించిన తరువాత మొట్ట మొదటి గౌరవం అందుకున్నది ఎవరో కాదు.మన భారత దేశ మణిపూస ఆహార ఉద్యమ నేత ప్రొఫెసర్ ఏం.ఎస్.స్వామినాధన్.

ఆ తరువాత 1989 లో భారత సంతతికి చెందిన వర్గీస్ కురియన్ ఈ అవార్డ్ అందుకున్నారు.కురియన్ ఆపరేషన్ వరద ప్రారంభించిన ఆయన భారత దేశాన్ని అతిపెద్ద పాల ఉత్పత్తి దేశంగా అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించారు.

ఆ తరువాత 1996 లో డాక్టర్ గురుదేవ్ ఖుష్ ఈ అవార్డ్ ను అందుకున్నారు.మళ్ళీ 1998 లో భారత దేశానికి చెందిన డాక్టర్.బీఆర్ బార్వాలే ఈ గౌరవాన్ని అందుకున్నారు.2000 లో సంవత్సరంలో భారత దేశానికి చెందిన సుందర్ కె వాసాల్ ఈ గౌరవాన్ని స్వీకరించగా 2005 లో డాక్టర్ మోడదుగు విజయ్ గుప్తా ఈ గౌరవాన్ని స్వీకరించారు, మంచి నీటిలో చేపల పెంపకాన్ని అతి తక్కువ ఖర్చుతో ఎలా చేయచ్చు అనే విషయాలపై ఈయన చేసిన కృషి ఎంతో మందికి లాభాలు తెచ్చిపెట్టింది.అయితే

Telugu Indianorigin, Prize-Telugu NRI

2005 నుంచీ 2014 వరకూ భారత దేశానికి గానీ, భారత సంతతి వ్యక్తులకు గానీ ఈ అవార్డ్ అందలేదు.కానీ 2014 లో మెక్సికోలో ఉన్న భారత సంతతి వ్యక్తీ డాక్టర్ సంజయ్ రాజారాం అందుకున్నారు.ఆ తరువాత 2020 లో భారత సంతతికి చెందిన ఇండో అమెరికన్ డాక్టర్ రతన్ లాల్ ఈ విశేష అవార్డ్ అందుకోగా.

మళ్ళీ 2021 లో భారత సంతతికి చెందిన శకుంతలా హరాక్ సింగ్ అనే న్యూట్రిషన్ కు దక్కింది.ప్రత్యేకంగా చేపల పెంపకంపై దృష్టి పెట్టిన ఆమె వాటిలో మైక్రో న్యుట్రిషియన్ లు, ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండేలా ఎన్నో ప్రయోగాలు చేశారు, ఫలితాలు సాధించారు.

దాంతో ఎన్నో దేశాలు ఆమె న్యూట్రిషియన్ ఫార్ములాలనే నేటికి అవలభిస్తున్నాయి.దాంతో ఆమె చేసిన విశేష కృషికి ప్రపంచ ఆహార బహుమతి లభించింది.ఈ అవార్డ్ లో భాగంగా ఆమెకు దాదాపు 2,50,000 డాలర్లు బహుమతిగా అందనున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube