బిగ్‌బాస్‌కు వెళ్లడానికి నూతన్‌ నాయుడు 4 కోట్లు ఖర్చు చేశాడట   Nuthan Naidu 4 Crore Spent For Big Boss Telugu 2     2018-07-10   23:54:50  IST  Raghu V

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 2 ఇటీవలే ప్రారంభం అయ్యింది. మొదటి సీజన్‌లో అంతా సెలబ్రెటీలను మాత్రమే తీసుకున్నారు. అయితే ఈసారి మాత్రం ముగ్గురు సామాన్యులకు కూడా స్థానం కల్పించడం జరిగింది. సామాన్యుల ఆడిషన్స్‌ కోసం లక్షల్లో అప్లికేషన్స్‌ వచ్చాయి. అందులోంచి కొన్ని తీసి, వారిల్లోంచి ముగ్గురిని ఎంపిక చేయడం జరిగింది. సామాన్యుల ఎంపిక విషయంలో అవినీతి జరిగినట్లుగా కొందరు ఆరోపిస్తున్నారు. నూతన్‌ నాయుడు ఏకంగా నాలుగు కోట్లు ఇచ్చి బిగ్‌బాస్‌ ఇంట్లోకి వెళ్లాడు అంటూ కొందరు ఆరోపిస్తున్నారు. బిగ్‌బాస్‌కు వెళ్తే భారీ క్రేజ్‌ వస్తుందని, అందుకే నూతన్‌ నాయుడు అంతగా ఖర్చు చేసినట్లుగా ప్రచారం జరుగుతుంది.

మొదటి సీజన్‌లో ఒక అనామకుడిగా ఎంట్రీ ఇచ్చిన కత్తి మహేష్‌ కేవలం నాలుగు వారాల పాటు ఇంట్లో ఉండి భారీ పబ్లిసిటీని, క్రేజ్‌ను దక్కించుకున్నాడు. బిగ్‌బాస్‌ కారణంగానే ప్రస్తుతం కత్తి మహేష్‌ ఈస్థాయి హోదాను అనుభవిస్తున్నాడు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కత్తి మహేష్‌ ప్రస్తుతం వైకాపా నుండి ఎంపీ సీటును కూడా ఆశిస్తున్నాడు అంటే అది ఖచ్చితంగా బిగ్‌బాస్‌ చలవే అని చెప్పుకోవచ్చు. అంతటి క్రేజ్‌ ఉన్న బిగ్‌బాస్‌లో ఎంత ఖర్చు పెట్టి అయినా వెళ్లాలని నూతన్‌ నాయుడు భావించి, షో నిర్వహించే కంపెనీకి నాలుగు కోట్లు ఆఫర్‌ చేసి వెళ్లినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.

నూతన్‌ నాయుడుపై వస్తున్న ఆరోపణలు సోషల్‌ మీడియాతో పాటు, వెబ్‌ మీడియాను కుదిపేస్తున్నాయి. ఇంత అవినీతి జరుగుతుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి సమయంలో స్టార్‌ మా వారిపై విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. ఈ వివాదంపై తాజాగా నూతన్‌ నాయుడు స్పందించాడు. తాను నాలుగు కోట్లు ఇచ్చినట్లుగా వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చాడు. బిగ్‌బాస్‌కు తాను అందరిలాగే వెళ్లాను అని, తాను బిగ్‌బాస్‌ వారు ఇంటికి వచ్చిన సమయంలో కనీసం బిస్కట్‌పాకెట్‌ ఇచ్చినా కూడా తీసుకోలేదు అంటూ చెప్పుకొచ్చాడు.

ఆడిషన్స్‌ను పిలిచేందుకు వారు ఇంటికి వచ్చిన సమయంలో కేవలం పూల బొకే ఇచ్చాను తప్ప మరేం ఇవ్వలేదు అంటూ చెప్పుకొచ్చాడు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారంకు నూతన్‌ నాయుడు క్లారిటీ ఇవ్వడం జరిగింది. మరి ఇప్పటికైనా ఈ ప్రచారంకు బ్రేక్‌ పడుతుందేమో చూడాలి. నూతన్‌ నాయుడు కేవలం రెండు వారాలు మాత్రమే ఇంట్లో కొనసాగాడు. ఆయన ప్రవర్తనతో ఇంట్లోంచి ప్రేక్షకులు వెంటనే వెళ్లగొట్టారు.