ఈ రాధా గోపాల వర్మ ఎవరు నూతన్‌ నాయుడు?

ప్రముఖ దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ ప్రస్తుతం పవన్‌ కళ్యాణ్‌ కు వ్యతిరేకంగా ‘పవర్‌ స్టార్‌’ చిత్రాన్ని చేస్తున్నాడు.అయితే వర్మ తాను తీస్తున్నది పవన్‌ కళ్యాణ్‌ గురించి కాదని ప్రవన్‌ కళ్యాణ్‌ గురించి అంటూ చెప్పిన విషయం తెల్సిందే.

 Nuthan Naidu, Rgv, Radha Gopala Varma, Parannageevi, Parannageevi About Director-TeluguStop.com

ఆ పవన్‌ కు ఈ ప్రవన్‌ కు చాలా తేడా ఉంది అంటూ వర్మ తనదైన శైలిలో ప్రమోషన్స్‌ చేసుకుంటున్నాడు.ఈ సమయంలోనే కొందరు పవన్‌ సన్నిహితులు తీస్తున్న సినిమా ‘పరాన్నజీవి’.

ఈ చిత్రంలో రామ్‌ గోపాల్‌ వర్మ గురించి ఉంటుందని అంతా అనుకుంటున్నారు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పరాన్నజీవి దర్శకుడు నూతన్‌ నాయుడు మాట్లాడుతూ తాను తీస్తున్నది రామ్‌ గోపాల్‌ వర్మ సినిమా కాదు.

అసలు రామ్‌ గోపాల్‌ వర్మ ఎవరో అనే విషయం కూడా నాకు తెలియదు అన్నాడు.మేము తీస్తున్న సినిమా రాధా గోపాల వర్మ అనే దర్శకుడి గురించి.

ఆయన దర్శకుడిగా ఉండి ఏం చేశాడు ఎందుకు ఆయన అలా ప్రవర్తించాడు అనే విషయాలను చూపించబోతున్నట్లుగా నూతన్‌ నాయుడు చెప్పుకొచ్చాడు.

Telugu Nuthan, Parannageevi-

రామ్‌ గోపాల్‌ వర్మ పబ్లిసిటీ స్టంట్‌ ను ఇక్కడ నూతన్‌ నాయుడు ఫాలో అవుతున్నాడు.ఖచ్చితంగా ఇక్కడ చూపిస్తున్నది రామ్‌ గోపాల్‌ వర్మనే అయినా కూడా టెక్నికల్‌ గా సమస్య రావద్దనే ఉద్దేశ్యంతో రాధా గోపాల వర్మ అనే పేరు మార్చారు.చిన్న పిల్లల నుండి పెద్ద వారి వరకు ఈ విషయం అర్థం అవుతుంది.

అయినా కూడా కొందరు నెటిజన్స్‌ ఈ రాధా గోపాల వర్మ ఎవరు నూతన్‌ నాయుడు అంటూ సరదాగా సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ చేస్తూ వర్మ ఫ్యాన్స్‌ ను రెచ్చగొట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube