బిగ్‌బాస్‌ సీజన్‌ 2 లో వాళ్ళకి అన్యాయం జరుగుతుందా

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 2 రెండు వారాలు పూర్తి చేసుకుంది.తాజాగా రెండవ వారం ఎలిమినేషన్‌ కార్యక్రమం కూడా పూర్తి అయ్యింది.

 Nutan Naidu Out From Bigg Boss Season-TeluguStop.com

రెండవ వారంలో ఇంటి నుండి నూతన్‌ నాయుడు ఎలిమినేట్‌ అయ్యాడు.బిగ్‌బాస్‌ సీజన్‌ 2లో మొదటి వారం సంజన, రెండవ వారం నూతన్‌ నాయుడులు ఎలిమినేట్‌ అవ్వడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

వీరిద్దరు కూడా సామాన్యుడి కోటాలో బిగ్‌బాస్‌ ఇంటికి వెళ్లిన విషయం తెల్సిందే.సామాన్యులకు ఛాన్స్‌ ఇచ్చినట్లే ఇచ్చి వెంటనే పంపించడం ఏంటని కొందరు విమర్శలు చేస్తున్నారు.

బిగ్‌బాస్‌ సీజన్‌ 2పై వస్తున్న విమర్శలకు ఇది కూడా తోడైంది.

మొదటి సీజన్‌లో కేవలం సెలబ్రెటీలకు మాత్రమే ఛాన్స్‌ ఇచ్చిన నిర్వాహకులు రెండవ సీజన్‌లో మాత్రం భారీ ఎత్తున ఆడిషన్స్‌ నిర్వహించి లక్షల మందిలో ముగ్గురిని ఎంపిక చేయడం జరిగింది.ఆ ముగ్గురిలో సంజన, నూతన్‌ నాయుడు, గణేష్‌ ఉన్నారు.ఈ ముగ్గురికి మొదటి నుండి కూడా బిగ్‌బాస్‌లో ఉన్న సెలబ్రెటీల నుండి వ్యతిరేకత వస్తుంది.

సామాన్యులకు మొదటి మూడు లేదా అయిదు వారాల పాటు ఎలిమినేషన్‌ నుండి ఉపశమనం కల్పిస్తే ఖచ్చితంగా వారి సత్తా ఏంటీ అనేది తేలిపోయింది.వారు హౌస్‌కు అవాటు పడుతున్న సమయంలో వారిని ఎలిమినేట్‌ చేయడం ప్రస్తుతం చర్చనీయాంశం అవుతుంది.

లక్షల మందిని ఆడిషన్స్‌ నిర్వహించి, చివరకు ముగ్గురుని తీసుకుని, వారిలో ఇద్దరిని మొదటి రెండు వారాల్లోనే ఎలిమినేట్‌ చేయడం ఏంటని ప్రేక్షకులు ప్రశ్నిస్తున్నారు.సామాన్యులకు జనాల్లో అంతగా గుర్తింపు ఉండదు.

అందుకే వారికి గుర్తింపు తెచ్చుకునేందుకు కాస్త సమయం ఇచ్చి ఆ తర్వాత ఎలిమినేషన్‌ పక్రియలో ఉంచాలి.కాని బిగ్‌బాస్‌ మాత్రం అలా చేయడం లేదు.

సామాన్యులు మరియు సెలబ్రెటీలు ఇలా అంతా కూడా ఒకటే అన్నట్లుగా ఎలిమినేషన్‌లో ఉంచడం వల్ల సామాన్యులకు ముందు ఎలిమినేషన్‌ తప్పడం లేదని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం హౌస్‌లో గణేష్‌ అనే ఒకే ఒక్క సామాన్యుడు ఉన్నాడు.

ఈయన కూడా ఈ వారం ఎలిమినేట్‌ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.ముగ్గురు సామాన్యులు వస్తే ముగ్గురు కూడా మొదటి మూడు వారాల్లోనే వెళ్లి పోతే సెలబ్రెటీల అహంకారం పీక్స్‌కు చేరుతుందనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది.

గణేష్‌ను ఈ వారం ఎలిమినేట్‌ కాకుండా చేయాలని స్టార్‌ మా వారు ప్రయత్నాలు చేసే అవకాశం లేకపోలేదు.ఓటింగ్‌ విషయంలో ఎలాంటి లెక్కలు నమోదు అవుతున్నాయో మాత్రం అర్థం కావడం లేదు.

బిగ్‌బాస్‌ రెండు వారాలు ముగిసిన తర్వాత కాస్త జోరు కనిపించే అవకాశం ఉందని ప్రేక్షకులు నమ్ముతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube