అయ్యో నూతన్‌ నాయుడు, ఎంత పని జరిగింది.. కౌశల్‌ మళ్లీ ఏకాకి  

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 2లో సామాన్యుడి కోటాలో ఎంట్రీ ఇచ్చిన నూతన్‌ నాయుడు కొన్ని అనుకోని కారణాల వల్ల రెండవ వారంలోనే ఎలిమినేట్‌ అయ్యాడు. నూతన్‌ నాయుడు ఎలిమినేట్‌ అయిన తర్వాత ఎక్కువ శాతం మంది ఆయన ఇంట్లో ఉంటే బాగుండేది అనుకున్నారు. బిగ్‌బాస్‌ ఇంటి సభ్యుడు కౌశల్‌కు సోషల్‌ మీడియాలో భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఏర్పడటం జరిగింది. కౌశల్‌ ఆర్మీ అంటూ సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉన్నారు. ఎప్పుడైతే ఎలిమినేషన్‌ అయిన వారికి మళ్లీ ఇంట్లోకి వెళ్లే ఛాన్స్‌ ఉంది అంటూ షో నిర్వాహకులు ప్రకటించారో వెంటనే కౌశల్‌ ఆర్మీ రంగంలోకి దిగింది.

Nutan Naidu Injured In Big Boss Telugu 2 House-

Nutan Naidu Injured In Big Boss Telugu 2 House

కౌశల్‌ ఆర్మీని ప్రసన్నం చేసుకోవడంతో పాటు, బిగ్‌బాస్‌ ఇంట్లో నూతన్‌ నాయుడు ఉంటే ఖచ్చితంగా కౌశల్‌కు బలం అవుతాను అంటూ నమ్మించాడు. దాంతో కౌశల్‌ ఆర్మీ లక్షల్లో నూతన్‌ నాయుడుకు మద్దతుగా ఓట్లు వేసి మళ్లీ ఇంట్లోకి పంపించారు. నూతన్‌ నాయుడు ఎంట్రీతో కౌశల్‌కు బలం పెరిగినట్లయ్యింది. కౌషల్‌కు మద్దతుగా నూతన్‌ నాయుడు నిలుస్తున్నాడు.
తాజాగా కెప్టెన్సీ టాస్స్‌లో భాగంగా కౌశల్‌కు మద్దతుగా నిలవాలనే ఉద్దేశ్యంతోనే రోల్‌ రైడాకు వ్యతిరేకంగా బంతులు బలంగా విసరడం చేశాడు. దాంతో నూతన్‌ నాయుడు చేయి ప్యాశ్చర్‌ అయ్యింది. గతంలోనే ఈయన చేయి విరగడంతో అది మళ్లీ ఇప్పుడు ప్రమాదకరంగా మారింది. కన్ఫెషన్‌ రూంలో ఈయనకు చికిత్స చేయించినా కూడా మరింత మెరుగైన చికిత్స అవసరం అని వైధ్యులు భావించారు. అందుకే ఆయన్ను ఇంటి నుండి పంపించాల్సిందే అని బిగ్‌బాస్‌ నిర్వాహకులు నిర్ణయించుకున్నారు.

Nutan Naidu Injured In Big Boss Telugu 2 House-

బిగ్‌బాస్‌ ఇంట్లోకి ఎంతో కష్టపడి, లక్షల మందితో పోటీ పడి, వేల మంది ఆడిషన్స్‌కు హాజరు అయితే తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుని ఎంట్రీ ఇచ్చిన నూతన్‌ నాయుడు రెండు సార్లు కూడా సిల్లీ రీజన్స్‌ కారణంగానే వెళ్లి పోవడం ఆయన దురదృష్టంగా అంతా చెబుతున్నారు. ఇక నూతన్‌ నాయుడు వెళ్లి పోవడం అనేది కౌశల్‌కు పెద్ద దెబ్బగా కౌశల్‌ఆర్మీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ కౌశళ్‌ ఏకాకిగా మిగిలి పోయాడు.