బెంగాలీ నటి, కాంగ్రెస్ ఎంపీ మిస్సెస్ నుస్రత్ జహాన్, నిఖిల్ జైన్ ల పెళ్లి చట్టబద్ధంగా చెల్లదని కోల్కతా కోర్టు తీర్పు వెలువరించింది.టర్కీలో వివాహం చేసుకున్నారని, మతాంతర వివాహం భారతదేశంలో నమోదు కాలేదని కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది.
అయితే లోక్ సభ అఫిడవిట్ లో నుస్రత్ జహాన్ తాను చట్టబద్ధంగా వివాహం చేసుకున్నట్టు ప్రకటించింది.టిఎంసి,ఎంపీ నుస్రత్ కూడా నిఖిల్ తో తన వివాహం టర్కీ చట్ట ప్రకారం జరిగిందని అందువల్ల భారతదేశంలో చెల్లుబాటు కాదని ప్రకటించారు.
అయితే 2019 జూన్ లో టర్కీ దేశ చట్టాలకు అనుగుణంగా నిఖిల్ ను వివాహం చేసుకున్న ఆమె పలు కారణాల వల్ల ఆ బంధం నుంచి విముక్తి కోరుకుంటుంది.ఈ నేపథ్యంలోనే టర్కీలో జరిగిన వివాహం ఇండియా లీగల్ కాదు.
మనదేశ చట్ట ప్రకారం ఏ మతపరమైన ఆచారాలను అనుసరించి జరగలేదు.కాబట్టి వారి ఏకాభిప్రాయ సంబంధాన్ని పెళ్లిగా పరిగణించలేము అని న్యాయస్థానం స్పష్టం చేసింది.

ఈ కోర్టు తీర్పు పై ఆమె స్పందిస్తూ.నిఖిల్ తో వివాహ సంబంధం నుంచి వద్దనుకొని ప్రిపేర్ అయిన తరువాత మా వివాహాన్ని రద్దు చేయాలని మార్చిలో కోర్టును ఆశ్రయించాను.ఇన్ని రోజులకు కోర్టు నాకు అనుకూలంగా తీర్పు ఇచ్చినందుకు సంతోషిస్తున్నాను.అలాగే సంక్లిష్ట సంబంధం నుంచి నాకు విముక్తి కలిగించినందుకు ధన్యవాదాలు అని ఆమె తెలిపింది.ఇక పలు కారణాల వల్ల నిఖిల్ తో విడిపోయిన ఆమె.ప్రస్తుతం బెంగాలీ నటుడు యష్ దాస్ గుప్తాతో రిలేషన్ లో ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారాలు జరుగుతున్నాయి.