బెల్లంకొండ సరసన బాలీవుడ్ బ్యూటీ ఫైనల్..ఎవరంటే!

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాతగా రాణిస్తూ, ఎన్నో భారీ హిట్ చిత్రాలను నిర్మించి తెలుగు ప్రేక్షకులకు అందించిన నిర్మాతలలో బెల్లంకొండ సురేష్ ఒకరు.బెల్లంకొండ వారసుడిగా బెల్లంకొండ శ్రీనివాస్ కూడా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.“అల్లుడు శీను” సినిమా ద్వారా తెలుగు తెరపై కనిపించి పర్వాలేదని పించాడు.ఈ సినిమా తర్వాత బెల్లంకొండ చేసిన సినిమాలన్నీ అంత హిట్స్ అయితే ఇవ్వలేదు.

 Nushrat To Be The Leading Lady In Chatrapathi Remake-TeluguStop.com

ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ తెలుగులో ప్రభాస్ హీరోగా 2005 లో దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించిన ఛత్రపతి సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే.అయితే ఇప్పుడు ఈ సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నారు.

ఈ సినిమాను హిందీలో మాస్ సినిమాల డైరెక్టర్ వివి వినాయక్ డైరెక్ట్ చేస్తున్నారు.

 Nushrat To Be The Leading Lady In Chatrapathi Remake-బెల్లంకొండ సరసన బాలీవుడ్ బ్యూటీ ఫైనల్..ఎవరంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సినిమా ద్వారా బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా మొదటిసారి హిందీ లో అడుగు పెట్టబోతున్నాడు.

Telugu Bellamkonda Srinivas, Bellamkonda Srinivas Bollywood Entry, Chatrapathi Remake, Director Vv Vinayak, Jayanthi Lal, Nushrat Bharucha, Nushrath Bharucha In Chatrapati Remake, Pen Studios-Movie

అంతేకాదు వివి వినాయక్ కు కూడా ఇదే మొదటి సినిమా.ఈ సినిమాను పెన్ స్టూడియోస్ బ్యానర్ పై జయంతిలాల్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.తాజాగా ఈ సినిమాపై ఒక అప్డేట్ వినిపిస్తుంది.ఈ సినిమాలో బెల్లంకొండ సరసన బాలీవుడ్ బ్యూటీ ని ఫిక్స్ చేసారని తెలుస్తుంది.

Telugu Bellamkonda Srinivas, Bellamkonda Srinivas Bollywood Entry, Chatrapathi Remake, Director Vv Vinayak, Jayanthi Lal, Nushrat Bharucha, Nushrath Bharucha In Chatrapati Remake, Pen Studios-Movie

అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో బాలీవుడ్ హాట్ బ్యూటీ నుష్రత్ బరుచా ను ఫిక్స్ చేసినట్టు సమాచారం.ఇప్పటికే ఈ బ్యూటీ పై చిత్ర యూనిట్ రెండు రోజుల పాటు చిత్రీకరణ జరిపారని టాక్ వినిపిస్తుంది.ఈ విషయాన్నీ బయటకు రాకుండా మేకర్స్ చాలా గోప్యంగా ఉంచుతున్నారట.బెల్లంకొండ నుష్రత్ మధ్య కెమిస్ట్రీ బాగా వర్క్ అవుట్ అవుతుందని వివి వినాయక్ ఈ సినిమాలో ఈ బ్యూటీ ని సెలెక్ట్ చేసాడట.

#Jayanthi Lal #VV Vinayak #Chatrapathi #Studios

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు