యూకే: సిక్కు సహోద్యోగి ‘తలపాగా’పై హేళన.. నర్సింగ్ లెక్చరర్‌పై వేటు

సిక్కు మత విశ్వాసాలను, వారి వేషధారణను అవహేళన చేసిన బ్రిటన్‌కు చెందిన ఓ లెక్చరర్‌పై వేటు పడింది.తన సహోద్యోగి, సిక్కు లెక్చరర్ అయిన వ్యక్తిపై జాతిపరమైన వ్యాఖ్యల నేపథ్యంలో మారిస్ స్లావెన్ అనే లెక్చరర్‌పై నర్సింగ్, మిడ్ వైఫరీ కౌన్సిల్ (ఎన్ఎంసీ) విచారణ జరిపింది.

 Nursing Lecturer Makes Fun Of Sikh Colleague's 'turban', Gets Fired From Uk's Me-TeluguStop.com

అక్టోబర్ 2016లో తాను ఉద్యోగం ప్రారంభించినప్పటి నుంచి డిసెంబర్ 2018 వరకు స్లావెన్ తనను అనేక సందర్భాలలో జాతిపరంగా వేధించాడని బాధితుడు ఆరోపించాడు.దీనిపై మార్చి 2019లో రిఫరల్ ప్రాక్టీస్ చేయడానికి ఎన్ఎంసీ ట్రిబ్యూనల్ ఫిట్‌నెస్ పొందింది.

ట్రిబ్యూనల్ ముందున్న సాక్ష్యాల ప్రకారం.స్లావెన్ తన సిక్కు సహోద్యోగిని తలపాగాకు సంబంధించి హేళన చేశాడు.2018 అక్టోబర్ 29న ఒక నర్సింగ్ మ్యాగజైన్‌లో బాధితుడి కమ్యూనిటీ వర్క్ గురించి కథనం రావడాన్ని ఉద్దేశిస్తూ.మీకు సిక్కు మతం గురించి అంతా తెలుసునని, గురునానక్ మీకు ఉత్తమ సహచరుడు అని పేర్కొన్నారని.

మరి మీ టోపీ ఎక్కడ అంటూ స్లావెన్ అవమానకరంగా మాట్లాడాడు.దీనిపై బాధితుడు స్పందిస్తూ.అది టోపీ కాదని.తలపాగా అని చెప్పాడు.

దీనికి స్లావెన్ బదులిస్తూ.ఇది ఒక టోపీలాంటిదేనంటూ వ్యాఖ్యానించాడు.

అంతేకాకుండా .భారతీయులు ఒక అరటి పడవలో యూకేకి వచ్చారంటూ జాతి విద్వేష వ్యాఖ్యలు చేశాడని ట్రిబ్యూనల్‌కి సమర్పించిన పత్రాలలో తెలిపారు.ఆ సమయంలో ఆంగ్లియా రస్కిన్ యూనివర్సిటీలో నర్సింగ్‌లో సీనియర్ లెక్చరర్ అయిన స్లావెన్.ఇది కేవలం ఇద్దరు మిత్రుల మధ్య పరిహాసము అని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు.

Telugu Banana, Indians, Slaven, Lecturerfun, Turban, Uks Medical-Telugu NRI

స్లావెన్.విశ్వవిద్యాలయం హెచ్ఆర్ విభాగానికి ఇచ్చిన వివరణ ప్రకారం ఇది ఇద్దరు స్నేహితుల మధ్య పరిహాసంగానే ఉద్దేశించబడ్డాయని ట్రిబ్యూనల్ పేర్కొంది.అలాగే బాధితుడు మనస్తాపం చెందినట్లు స్లావెన్ గ్రహించలేదని తెలిపింది.కానీ ఉద్దేశం ఏదైనా స్లావెన్ వ్యాఖ్యలు అభ్యంతకరంగా వున్నాయని.అతని ప్రవర్తన వివక్షకు, మనోవేదనకు గురిచేసేలా వున్నాయని సిక్కు సహోద్యోగి వ్యాఖ్యానించారని ట్రిబ్యూనల్ పేర్కొంది.ఇందుకు గాను స్లావెన్‌ను యూకే మెడికల్ రిజస్టర్ నుంచి తొలగించడంతో పాటు 18 నెలల పాటు సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube