ప్రమోషన్ లో అన్యాయం ! గొంతు కోసుకున్న నర్స్  

Nurse Suicide Attempt In Nims Hospital-

పోరాడి సాధించుకునే అవకాశం ఉన్నా ఆవేశంలో తొందరపడి గొంతు కోసుకుని ప్రాణాలు మీదకు తెచ్చుకున్న ఓ నర్స్ ఉదంతం నిమ్స్ లో కలకలం రేపింది.వివరాలు పరిశీలిస్తే ప్రమోషన్లు ఉన్నతాధికారులు తనకు అన్యాయం చేశారంటూ నిమ్స్ స్టోర్స్ లో పనిచేస్తున్న నిర్మల అని నర్స్ ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది.గతంలో నిమ్స్ లో నర్స్ గా పనిచేసిన నిర్మల అడ్మినిస్ట్రేషన్ విభాగంలో పని చేయాలనే ఉద్దేశంతో దానికి సంబంధించిన కోర్సులు పూర్తి చేసింది .అయితే ఆమెకు ప్రమోషన్ దక్కకుండా కొంతమంది ఉద్యోగులు అడ్డం పడడమే కాకుండా అర్హతలేని వారికి ప్రమోషన్ కల్పించారని నిర్మల భావించింది.

Nurse Suicide Attempt In Nims Hospital- Telugu Viral News Nurse Suicide Attempt In Nims Hospital--Nurse Suicide Attempt In Nims Hospital-

ఇలా పదిమంది వరకు ప్రమోషన్ పొందారు.అయితే పదిహేనేళ్లుగా పనిచేస్తున్న తనకు ప్రమోషన్ రాకుండా ఇతరులకు ప్రమోషన్ రావడంపై మనస్తాపం చెందిన నిర్మల ఇదే విషయాన్ని తేల్చుకునేందుకు మెడికల్ సూపరింటెండెంట్ చాంబర్ కు కొంతమంది నర్స్ లతో కలిసి వెళ్ళింది.భోజనం చేస్తున్నాను అని వేచి ఉండమని సూపరిండెంట్ చెప్పాడు.అయితే అకస్మాత్తుగా నిర్మల తనతో తెచ్చుకున్న బ్లేడుతో చేతులు, మెడ కోసుకుంది.

Nurse Suicide Attempt In Nims Hospital- Telugu Viral News Nurse Suicide Attempt In Nims Hospital--Nurse Suicide Attempt In Nims Hospital-

ప్రస్తుతం నిర్మల ఐసీయూలో చికిత్స పొందుతోంది.ప్రమోషన్ లో అన్యాయం జరగడం వల్లే నిర్మల ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని ఆమె భర్త ఆరోపిస్తున్నాడు.