వైద్యో నారాయణో హరి అని అంటారు పెద్దలు.వైద్యం చేసే వారు దేవుళ్ళ తో సమానంగా చూస్తారు.
వ్యక్తి ప్రాణాల మీదకు వస్తే దేవుడిలా డాక్టర్ లు నర్సులు ఆదుకుంటారు అని అని అందరూ నమ్ముతారు.కానీ అలాంటి ప్రాణాలు కాపాడాల్సిన వారే తమ ప్రాణాల మీదకు తీసుకువస్తే జనాలు ఎవరికి తమ బాధను మొరపెట్టుకొంటారు.
అలాంటి ఒక నర్సు నిర్లక్షణ ఘటన తమిళనాడు లో చోటుచేసుకుంది.ఆ రాష్ట్రంలోని రామనాథపురం జిల్లా ఉచిప్పులి పట్టణంలోని ప్రభుత్వ ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో కె.రమ్య(21) అనే గర్భిణీ ప్రసవం కోసం అని వెళ్ళింది.అయితే ఆ సమయంలో రమ్యకు అసిస్టెంట్ సర్జన్ యాసీన్, స్టాఫ్ నర్సు అన్‌బు సెల్వీలు సాధారణ ప్రసవం చేశారు.
రమ్యకు పండంటి ఆడబిడ్డ జన్మించింది.ప్రసవం అనంతరం రమ్య తన ప్రైవేటు పార్టు నుంచి తీవ్ర రక్త స్రావం అవ్వడం తో తేగా ఇబ్బంది పడింది.
అయితే తన భార్య బాధను చూసిన భర్త కార్తికేయన్ యూపీ హెచ్ సి వైద్యులను తిరిగి నిలదీయడం తో వారు రామనాథపురం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లాలని రిఫర్ చేయడం తో అక్కడ వైద్యులు రమ్య కు ఎక్స్ రే తీయగా అసలు విషయం వెల్లడింది.ఆమె ప్రయివేట్ పార్టు లోపల విరిగిన సూది కనిపించడం తో వైద్యులు అది తొలగించాలి అంటే శస్త్ర చికిత్స చేయాల్సిందే అని చెప్పారు.
దీనితో మధురై ఆసుపత్రిలో వైద్యులు గంటపాటు శ్రమించి ఆమె ప్రయివేట్ పార్టు నుంచి ఆ విరిగిన సూదిని బయటకు తీయడం తో రమ్య సేఫ్ గా ఉంది.

అయితే రమ్య ప్రసవం సమయంలో ప్రైవేటుపార్టులో నర్సు సూదితో కుట్లు వేసిందని, అలా కుట్లు వేసేటపుడు సూది విరిగిపోయిందని దానిని అలా వదిలేశారని వైద్యాధికారి డాక్టర్ కుమారకురుబరన్ చెప్పారు.సూది విరిగిపోయిన కారణంగానే రమ్య కు తీవ్ర రక్త స్రావం అయ్యింది అని ఈ ఘటనకు కారకులైన ఆ నర్సును సస్పెండ్ చేశామని, అలానే ప్రసవం చేసిన అసిస్టెంట్ సర్జన్‌పై చర్యలు తీసుకోవాలని తమిళనాడు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు సిఫారసు చేశామని వైద్యాధికారులు తెలిపారు.