కరోనా పేషెంట్లకి బికినీలో సేవలు చేసిన నర్సు… సోషల్ మీడియాలో వైరల్  

Nurse Reprimanded Transparent Ppe - Telugu Corona Effect, Covid-19, Lock Down, Nurse Reprimanded For Wearing Bikini Under Transparent Ppe

ప్రపంచంలో ఏ మూల ఎలాంటి వింత జరిగిన క్షణాలలో సోషల్ మీడియాలోకి వీడియో రూపంలోనో, ఫోటోలు రూపంలోనో వచ్చేస్తూ ఉంటాయి.అవి అంత వేగంగా వైరల్ అవుతాయి.

 Nurse Reprimanded Transparent Ppe

ఇప్పుడు అలాంటి ఆశ్చర్యకరమైన సంఘటనకి సంబందించిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ప్రపంచ వ్యాప్తంగా లక్షల సంఖ్యలో ఉన్న కరోనా రోగులకి హాస్పిటల్స్ లో నర్సులు సేవలు అందిస్తున్నారు.

పీపీఈ కిట్లు ధరించి వారికి సేవలు చేస్తున్నారు.ర‌ష్యాలోని టులా న‌గ‌రంలోని ఆసుప‌త్రిలో ఓ ఇర‌వైయేళ్ల యువ‌తి న‌ర్సుగా సేవ‌లందిస్తోంది.

కరోనా పేషెంట్లకి బికినీలో సేవలు చేసిన నర్సు… సోషల్ మీడియాలో వైరల్-General-Telugu-Telugu Tollywood Photo Image

అక్క‌డ‌ క‌రోనా రోగుల‌కు చికిత్స అందిస్తున్న వైద్యుల‌తో పాటు న‌ర్సుల‌కు సైతం హాస్పిట‌ల్ యాజ‌మాన్యం పీపీఈ కిట్ల‌ను అందించింది.

అయితే ఆ యువ‌తికి, తన న‌ర్సు డ్రెస్సుతోపాటు పీపీఈ కిట్ల‌ను ధ‌రించ‌డం క‌ష్టంగా అనిపించింది.

వీట‌న్నింటినీ ధ‌రిస్తే భ‌రించ‌లేని ఉక్క‌పోత‌గా ఉందంటూ న‌ర్సు డ్రెస్సును తీసి ప‌క్క‌న ప‌డేసింది.కేవ‌లం బికినీ ధ‌రించి ఆపై పీపీఈ షూట్ వేసుకొని నర్సుగా ఆమె డ్యూటీ చేసింది.

పీపీఈ కిట్ పార‌ద‌ర్శ‌కంగా ఉన్న‌ప్ప‌టికీ ఆ న‌ర్సు అవేమీ ప‌ట్టించుకోకుండా క‌రోనా వార్డుల్లో చికిత్స అందిస్తోంది.ఆమె నిర్ణ‌యానికి ఆసుప‌త్రి యాజ‌మాన్యం కూడా అడ్డు చెప్ప‌కుండా చూసీ చూడ‌న‌ట్టు ఉంది.

ఆ న‌ర్సు వేష‌ధార‌ణ‌కు బిత్త‌ర‌పోయిన‌ ఓ క‌రోనా పేషెంట్ ఆమెను ఫొటో తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు.దీంతో ఆ ఫొటో వైర‌ల్‌గా మారింది.

ఈ విష‌యం ఆ దేశ‌ ఆరోగ్య శాఖ చెవిన ప‌డ‌టంతో ఆమెపై క్ర‌మ‌శిక్ష‌ణా రాహిత్యం కింద చ‌ర్య‌ల‌కు ఆదేశించింది.అయితే ఆమె చేసిన ప్రయత్నంలో ఎలాంటి తప్పు లేదని, తన వృత్తి నిర్వహణ బాధ్యతాయుతంగానే చేసిందని సోషల్ మీడియాలో చాలా మంది ఆమెకి మద్దతుగా నిలబడ్డారు.

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Nurse Reprimanded For Wearing Bikini Under Transparent Ppe Related Telugu News,Photos/Pics,Images..