అయ్యో పాపం : బిడ్డను ప్రసవించి.. గతం మరిచిపోయిన తల్లి!  

nurse, pregnant, brain injury, covid-19, corona virus - Telugu Brain Injury, Corona Virus, Covid-19, Nurse, Pregnant

ప్రపంచ దేశాల ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్న కరోనా వైరస్ వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు అన్నీఇన్నీ కావు.కరోనా కు వ్యాక్సిన్ వచ్చేంత వరకు ప్రజలు ఇబ్బందులు పడక తప్పదు.

TeluguStop.com - Nurse Pregnant Brain Injury Covid 19

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

కరోనాకు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా వైరస్ నుంచి పూర్తిగా నియంత్రిస్తుందో లేదో చెప్పలేమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.తాజాగా కరోనా వల్ల న్యూయార్క్‌లోని బ్రూక్లేన్‌ కు చెందిన మహిళ పడిన కష్టాలు తెలిస్తే అయ్యో పాపం అనిపిస్తోంది.

TeluguStop.com - అయ్యో పాపం : బిడ్డను ప్రసవించి.. గతం మరిచిపోయిన తల్లి-General-Telugu-Telugu Tollywood Photo Image

సెల్వియా అనే 35 సంవత్సరాల మహిళ బ్రూక్‌డాలే యూనివర్శిటీ హాస్పిటల్ మెడికల్ సెంటర్‌లో నర్సుగా విధులు నిర్వర్తించేది.కొన్ని నెలల క్రితం గర్భవతి అయిన సెవియా అదే సమయంలో కరోనా బారిన పడింది.

అనంతరం కరోనా చికిత్స కోసం ఆస్పత్రిలో చేరిన సెల్వియాకు వైరస్ సోకిన 14 రోజుల తర్వాత గుండె నొప్పి వచ్చింది.సదరు మహిళ సాధారణ స్థితికి చేరుకున్న తరువాత సిజేరియన్ చేసి వైద్యులు బిడ్డను బయటకు తీశారు.

సిజేరియన్ సమయంలో వైద్యులు కొన్ని నిమిషాల పాటు సెల్వియాకు ఆక్సిజన్ లేకుండా ఉంచాల్సి రావడంతో ఆమె మెదడుకు గాయమై గతం మరిచిపోయింది.ప్రస్తుతం సెల్వియాకు తనకు కరోనా సోకిన సంగతి, గుండెనొప్పి వచ్చిన సంగతి, బిడ్డకు జన్మనిచ్చిన సంగతి కూడా తెలీదు.

వైద్యులు ఆమెకు అర్థమయ్యేలా చెప్పాలని ప్రయత్నించినా సెల్వియా డాక్టర్లు చెప్పే విషయాలను పట్టించుకోకుండా బిత్తర చూపులు చూస్తోంది. సెల్వియా తన భర్త, మూడేళ్ల కుమారుడిని కూడా గుర్తుపట్టకపోవడం గమనార్హం.

#Nurse #COVID-19 #Brain Injury #Corona Virus #Pregnant

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Nurse Pregnant Brain Injury Covid 19 Related Telugu News,Photos/Pics,Images..