నిఫా నర్సు భర్త చేసిన పని తెలిస్తే శెభాష్ అంటారు.నాడు భార్య..నేడు భర్త..

విధి నిర్వహణలో భాగంగా నిఫా వైరస్ రోగులకు చికిత్స అందిస్తూ ఆ వైరస్‌ బారిన పడి ప్రాణాలు వదిలిన నర్సు లిని గుర్తుందా.? వైరస్ వ్యాప్తి చెందుతుందనే కారణం చేత లిని శరీరాన్ని కుటుంబానికి అప్పగించకుండా దహనం చేసిన సంగతి తెలిసిందే.నిఫా మహ్మమారి సోకి చనిపోయే ముందు లిని తన భర్తకి రాసిన లేఖ సోషల్ మీడియా మొత్తాన్ని కంటతడి పెట్టించింది.అప్పుడు లిని తన నిస్వార్ధ సేవతో ప్రాణాలు కోల్పోతే ఇప్పుడు తన భర్త తన నిస్వార్ధ బుద్దితో సేవాగుణాన్ని చాటుకున్నాడు.

 Nurse Lini Husband Donates First Salary To Kerala Flood Victims-TeluguStop.com

లిని చనిపోయిన తర్వాత కేరళ ప్రభుత్వం ఆమె భర్త సజీష్ ఆరోగ్య శాఖలో క్లర్క్‌గా ఉద్యోగాన్ని ఇచ్చింది.కేరళలో వరదలు బీభత్సం సృష్టిస్తోన్న తరుణాన సజీష్ మంచి నిర్ణయం తీసుకున్నాడు.తన నిర్ణయంతో అందరి చేత శెభాష్ అనిపించుకుంటున్నాడు.ఇటీవల ఆరోగ్యశాఖలో ఉద్యోగంలో చేరిన సజీష్ తన మొదటి నెల జీతాన్ని సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఇచ్చశాడు.కొజికోడ్ జిల్లాలోని వడకర పెరంబర‌లో జరిగిన ఓ కార్యక్రమంలో సజీష్ తన జీతాన్ని కార్మిక శాఖ మంత్రి టీపీ రామకృష్ణన్‌కు ఇచ్చేశాడు.‘కష్ట కాలంలో కేరళ ప్రభుత్వం, ప్రజలు నాకు, నా కుటుంబానికి అండగా నిలిచారు.

ఇప్పుడు వారికి అండగా నిలవడం నా బాధ్యత’ అని సజీష్ తెలిపాడు.

సాయం చిన్నదా పెద్దదా కాదు.

మనకు తోచింది చేసే ఎంత చిన్నసాయమైనా పెద్దదిగానే తోస్తుంది.వందేళ్లలో ఎన్నడూ లేని విధంగా వర్షాలు కేరళను చిన్నాభిన్నం చేస్తుంటే.

చిన్నా పెద్దా అంతా కేరళకు సాయం చేయడానికి ముందుకొస్తున్నారు.మరో వైపు 5000మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రాణాలకు తెగించి సైతం వరదల్లో చిక్కుకున్న వారిని రక్షిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube