ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక పాట ఫేమస్ అయ్యింది.బుల్లెట్ బండి అనే సాంగ్ పాడినప్పుడు విడుదల చేసినప్పుడు కూడా ఇంత పాపులర్ అవ్వలేదు కానీ ఒక వధువు తన పెళ్ళిలో పెళ్లి కొడుకు కోసం ఈ పాటకు డాన్స్ వేయడంతో ఆ వీడియో నెట్టింట వైరల్ అయ్యింది.
పెళ్లి కూతురు చేసిన డాన్స్ కు నెటిజెన్స్ ఫిదా అయ్యారనే చెప్పాలి తన డాన్స్ తో ఈ పాటను కూడా ఫేమస్ చేసింది.
ఆ పెళ్లి కూతురు డాన్స్ చేసిన తర్వాతనే ఈ పాట గురించి అందరికి తెలిసింది.
అప్పటి నుండి ఈ పాటకు చాలా మంది మహిళలు ఫాన్స్ అయిపోయారు.ఆ పాటకు డాన్స్ చేస్తూ తమ ఆనందాన్ని తెలుపుతున్నారు.ఈ పాటను తెలంగాణ పాలమూరు జిల్లాకు చెందిన లక్ష్మణ్ అనే వ్యక్తి రాసాడు దీనిని సింగర్ మోహన భోగరాజు ఆలపించారు ఈ సాంగ్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.
ఇప్పుడు బుల్లెట్ బండి పాటకు నర్స్ డాన్స్ చెయ్యడంతో ఈ వీడియో కూడా వైరల్ అయ్యింది.ఈ పాట గురించి మరొకసారి అందరు మాట్లాడు కుంటున్నారు.స్వాతంత్ర దినోత్సవం సంబరాల్లో ఒక నర్స్ ఈ పాటకు డాన్స్ చెయ్యడంతో ఈ వీడియో కాస్త వైరల్ అయ్యింది.
ఈ వీడియో కూడా నెటిజెన్స్ ను ఆకట్టుకున్న ఈ నర్స్ విధుల్లో ఉన్నప్పుడు డాన్స్ చేయడంతో అధికారులు ఈ విషయంపై సీరియస్ అవుతున్నారు.
విధుల్లో ఉండగా ఇలా డాన్స్ చేస్తూ ఉండడం తప్పు అని అందుకు చర్యలు కూడా తీసుకుంటామని చెబుతున్నారు.
అయితే స్వతంత్ర దినోత్సవ సంబరాల్లో చేసినందు వల్ల పెద్ద తప్పుగా భావించాల్సిన అవసరం లేదని కొంతమంది అభిప్రాయ పడుతున్నారు.అందుకే సంబరాల సందర్భంగా డాన్స్ చేసినందు వల్ల ఆమె మీద ఎలాంటి చర్యలు తీసుకోకూడదని నెటిజెన్స్ కామెంట్స్ పెడుతున్నారు.
మరి చూడాలి అధికారులు ఆమెను వదిలేస్తారా.లేదంటే చర్యలు తీసుకుంటారా.