దేశంలో విజృంభిస్తున్న క‌రోనా.. ఈ రోజు ఎన్ని కేసులంటే.. ?

ప్రస్తుతం దేశంలో క‌రోనా కేసుల విజృంభ‌ణ తీవ్రంగా కొన‌సాగుతోంది.ఇప్పటికే కోవిడ్ విషయంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన నియమాలను నిరంకుశంగా అమలు చేస్తుండగా, ఈ నిబంధలను పాటించని వారికి జరిమానాలను విధిస్తూ కరోనా రూల్స్‌ను ఆదాయమార్గాలుగా మలచుకున్నాయి ప్రభుత్వాలు.

 Number Of Corona Cases In The Country-TeluguStop.com

ఇదిలా ఉండగా దేశంలో గడచిన 24 గంట‌లలో నమోదైన కోవిడ్ కేసుల వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది.వాటి వివరాలు తెలుసుకుంటే.

దేశంలో నిన్న కొత్త‌గా 1,61,736 మందికి కరోనా నిర్ధారణ అయిందని, వీటితో కలిపి కరోనా కేసుల సంఖ్య మొత్తం 1,36,89,453 కు చేరిందని పేర్కొంది.

 Number Of Corona Cases In The Country-దేశంలో విజృంభిస్తున్న క‌రోనా.. ఈ రోజు ఎన్ని కేసులంటే.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కాగా గడచిన 24 గంటల్లో 879 మంది కరోనా కారణంగా మృతి చెందగా వీరితో కలిపి మృతుల సంఖ్య 1,71,058 కు పెరిగింది.

ఇక కోవిడ్ నుండి నిన్న‌ 97,168 మంది కోలుకోగా, దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 1,22,53,697 మంది కోలుకున్నట్లు, 12,64,698 మంది ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుకుంటున్నట్లుగా ఆరోగ్యశాఖ వెల్లడించింది.

#India Bulletin #COVID-19 #Positive Cases #Corona Status

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు