ఏడు సంఖ్య దురదృష్టానికి సంకేతమా..?

ఏడు నంబర్ వస్తే చాలు చాలా మంది దురదృష్టానికి సంకేతం అనుకుంటారు. ఏదో చెడు జరుగుతుందనే అనుమానంతో ఉంటారు.

 Number 7 Is Lucky Or Not Details, Number Seven, Lucky, Unlucky, Seven Hills, Tirupati Venkateswara Swamy, Marriage, Seven Steps, Reason, Unlucky Number, Sun Rays-TeluguStop.com

 కానీ సంఖ్యల్లో ఏం ఉండదు. అంతా మనం చేసే మంచి పనుల్లోనే ఉంటుంది.

 మనం చేసే మంచి పనులే మనకు అదృష్టాన్ని కల్గజేస్తాయి అనడానికి. ఏడు సంఖ్య దురదృష్టం కాదు అనడానికి ఇదే నిదర్శనం కావాలంటే చూడండి.

 Number 7 Is Lucky Or Not Details, Number Seven, Lucky, Unlucky, Seven Hills, Tirupati Venkateswara Swamy, Marriage, Seven Steps, Reason, Unlucky Number, Sun Rays-ఏడు సంఖ్య దురదృష్టానికి సంకేతమా..-Devotional-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కోరిన కోర్కెలు తీర్చే ఆ తిరుపతి వెంకటేశ్వరుని కొండలు… ఏడు ప్రతి రోజూ ఉదయం మనం చూసే సూర్యభగవానుడి నుంచి వచ్చే కిరణాలు కూడా ఏడే… అలాగే పాతాళం కింద ఉండే లోకాలు ఏడే. భువర్లోకాలు కూడా ఏడే. ద్వీపాలు కూడా ఏడే. అలాగే పెళ్లిలో వధూవరులిద్దరూ కలిసి వేసే అడుగులు ఏడే. అంతే కాదండోయ్. అగ్ని దేవుని నాలుకలు ఏడు. బ్రహ్మోత్సవాలు జరిగేది ఏడో నెలలోనే. సప్త స్వర్గాలు కూడా ఏడే.

సంఖ్య మంచిది కాదనేది కొందరి మూఢ నమ్మకం.7 సంఖ్య కూడా మంచిదే. భగవంతుడు సృష్టించే ప్రతీది మన కోసమే. వాటిని ఉపయోగించే పద్ధతుల వల్లే మనకు ఫలితం లభిస్తుంది. అందుకే ఎవరికీ నష్టం జరగకుండా మనం మంచి పనులు చేస్తే… కచ్చితంగా మనకు మంచే జరుగుతుంది. ఒకవేళ చెడు జరిగినా… రాబోయే కాలంలో అయినా ఆ దేవుడు మనకు మంచే చేస్తాడు.

అందుకే మనకు వీలైనంత వరకు అందరికీ మంచే చేయాలి.అప్పుడే మనం మన పిల్లలు సంతోషంగా జీవిస్తారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube