భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గత రాత్రి ఢిల్లీలోని ఆర్మీ హాస్పటల్‌లో తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే.తీవ్ర అనారోగ్యంతో 21 రోజులు పోరాటం చేసిన ఆయన సోమవారం తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.
జర్నలిస్ట్ గా కెరీర్ ను స్టాట్ చేసి.రాష్ట్రపతి వరకూ ఎదిగిన ప్రణబ్ ముఖర్జీ జీవితం ఎందరికో ఆదర్శం.
మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగిన ప్రణబ్.వివాదరహితుడిగా, మచ్చలేని రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనంగా పేరొందారు.అలాంటి ప్రణబ్ ముఖర్జీ ఇక లేరన్న వార్త దేశప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు.ఈ క్రమంలోనే ఆయన పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు.
అయితే ప్రణబ్ ముఖర్జీ లక్కీ నెంబర్‌గా 13 చెబుతారు.

ఒకరకంగా చెప్పాలంటే నెంబర్ 13కు, ప్రణబ్ ముఖర్జీకి వీడతీయలేని సంబంధం ఉందని చెప్పాలి.ఎందుకంటే, ప్రణబ్ ముఖర్జీకి.1957, జూల్ 13న సువ్రాతో వివాహం జరిగింది.ప్రణబ్, సువ్రా దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.ప్రణబ్ లోక్ సభకు ఎన్నికైంది 2004, మే 13నే.ఆయన లోక్‌సభలో 2004 నుంచి 2012 వరకు కొనసాగారు.
అలాగే ఆయన 2012లో ప్రతిభా పాటిల్ పదవీ విరమణ తర్వాత ప్రణబ్ ముఖర్జీ 13వ రాష్ట్రపతిగా ఎన్నికై బాధ్యతలు చేపట్టడం మరో విశేషం.
ఇక యూపీఏ ప్రభుత్వంలో పార్లమెంట్ లోని రూమ్ నెంబర్ 13లోనే ప్రణబ్ ముఖర్జీ కార్యాలయం ఉండేది .అందుకే నెంబర్ 13కు ప్రణబ్ ముఖర్జీ జీవితంలో ప్రత్యేక స్థానం ఏర్పడింది.