మా నాన్నను ఒరేయ్ ఏరా అంటా.. జబర్దస్త్ కమెడియన్ కామెంట్స్ వైరల్..?

సాధారణంగా తండ్రిని ఎవరైనా గౌరవంగా పిలుస్తారు.అయితే జబర్దస్త్ కమెడియన్ నూకరాజు మాత్రం తన తండ్రిని శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో ఏరా ఒరేయ్ అన్నారు.

 Nukaraju Shocking Comments About His Father In Sridevi Drama Company Show-TeluguStop.com

అయితే తండ్రిపై ఉన్న ప్రేమతోనే నూకరాజు ఆ విధంగా కామెంట్లు చేయడం గమనార్హం.నూకరాజు శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో మాట్లాడుతూ తాను తన తండ్రిని నాన్న అని పిలవడం కంటే ఏరా ఒరేయ్ అని ఎక్కువగా పిలుస్తానని చెప్పుకొచ్చారు.

వాడు నన్ను ఏమంటాడంటే హే బ్రో అని అంటాడని నూకరాజు చెప్పుకొచ్చారు.వీడు మామూలోడు కాదని ఇంటి దగ్గర చాలా ఉంటాయని నూకరాజు చెప్పగా రామ్ ప్రసాద్ మీ డాడీ లవ్ స్టోరీ కూడా నాకు తెలుసని చెబుతాడు.

 Nukaraju Shocking Comments About His Father In Sridevi Drama Company Show-మా నాన్నను ఒరేయ్ ఏరా అంటా.. జబర్దస్త్ కమెడియన్ కామెంట్స్ వైరల్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే నూకరాజు మాత్రం డాడీ లవ్ స్టోరీ మాత్రమే కాదని బ్యాక్ స్టోరీలు ఎక్కువ డాడీకి చాలా చేశాడు వీడు అంటూ చెప్పుకొచ్చాదు.అలా చెప్పిన తరువాత నూకరాజు తండ్రి దండం పెడతాడు.

Telugu Daddy Lovestory, Judge Indraja, Nookaraju, Sridevi Drama Company-Movie

హైపర్ ఆది మీ నాన్న వచ్చినప్పటి నుంచి ఎప్పుడూ నమస్కారం పెట్టలేదని చాలా చేశాడు ఊరిలో అని చెప్పిన తరువాత నమస్కారం పెట్టాడని ఆది నూకరాజు తండ్రి గురించి కామెంట్లు చేశారు.అయితే తండ్రీకొడుకు మధ్య అనుబంధం ఎంత ఉన్నా ఒరేయ్ ఏరా అని పిలవడం కరెక్ట్ కాదని నెటిజన్లు నూకరాజుకు సలహాలు ఇస్తున్నారు.తండ్రి రహస్యాలను పబ్లిక్ లో లీక్ చేయడం కరెక్ట్ కాదని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.

నూకరాజు చేసిన కామెంట్ల వల్ల భవిష్యత్తులో తండ్రి ఇబ్బందులు పడాల్సి వస్తుందని మరి కొందరు చెబుతున్నారు.

మరోవైపు శ్రీదేవి డ్రామా కంపెనీ షోకు ఇంద్రజ హాజరు కావడంతో ఆమె ఫ్యాన్స్ ఆనందపడుతున్నారు.ఈ షోలో ఇంద్రజను జడ్జిగా కొనసాగించాలని ఆమె అభిమానులు కోరుతుండటం గమనార్హం.

#Judge Indraja #Nookaraju #SrideviDrama #Daddy Lovestory

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు