Flying Hotel: గాలిలో తేలియాడే హోటల్ గురించి ఎపుడైనా విన్నారా?

మారుతున్న కాలంతో పాటు మనిషికి ఏవేవో ఐడియాలు వస్తుంటాయి.అయితే ఎలాంటి ఐడియా వచ్చిన అది మానవాళి మనుగడ కోసమో, లేదా వారిని రంజింపజేయడం కోసమో అయి ఉంటుంది.

 Nuclear Powered Luxurious Flying Hotel Can Fly Over 5000 Guests-TeluguStop.com

ఈ విషయం మానవాళిని రంజింపజేయడానికి వచ్చిన ఐడియా అని చెప్పుకోవాలి.బాగా డబ్బున్నవారు విందులు విలాసాల కోసం ఎంతైనా ఖర్చు చేస్తారు.

ముఖ్యంగా సుఖంకోసం మనిషి ఎంతైనా ఖర్చు చేయడానికి ఇష్టపడతాడు.ఈ విషయం తెలుసుకొన్న వారు వారి క్యూరియాసిటీని క్యాష్ చేసుకోవడానికి ఇలాంటి ఆవిష్కరణలు కనిపెడుతూ వుంటారు.

 Nuclear Powered Luxurious Flying Hotel Can Fly Over 5000 Guests-Flying Hotel: గాలిలో తేలియాడే హోటల్ గురించి ఎపుడైనా విన్నారా-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇంకేముంది.బోలెడంత సుఖంతో పాటు డబ్బే డబ్బు.

బేసిగ్గా మనం విమానాలు గాలిలో ఎగరడం చూసాం.అలాగే రాకెట్లు నింగిలోకి దూసుకుపోతాయి.హెలికాప్టర్లు కూడా ఆకాశంలో చక్కెర్లు కొడతాయి.అయితే ఒక హోటల్ గాలిలో ఎగరడం ఎపుడైనా చూశారా? ఏంటి ఆశ్చర్యపోతున్నారా? మీరు విన్నది నియమేనండి.ఇక్కడ ఓ హోటల్ గాలిలో ఎగురుతోంది.అందులో వందల సంఖ్యలో కస్టమర్లు కడుపారా తమకు నచ్చింది ఆరగిస్తున్నారు.అయితే ఆ హోటల్ ఓ విమానంలో సెట్ చేశారనుకోండి.అది వేరే విషయం.

పూర్తిగా కృత్రిమ మేధ సాయంతో ఎగిరే ఈ విమానంలో ఒకేసారి 5 వేల మంది అతిథులు ఆకాశయానం చేయొచ్చట.ఇంత భారీ విమానం గాల్లో ఎగిరేందుకు వీలుగా అణు ఇంధనంతో నడిచే 20 ఇంజిన్లను ప్రత్యేకంగా దీనికోసం డిజైన్‌ చేశారు మేకర్స్.

Telugu Fly, Hotel, Hotel Aeroplane, Nuclear Fule, Nuclearpowered, Latest-Latest News - Telugu

ఇక ఈ విమానంలో సౌకర్యాలకు కొదువేమి లేదు.ఇందులో ఒక భారీ షాపింగ్‌ మాల్, రెస్టారెంట్లు, బార్లు, స్పోర్ట్స్‌ సెంటర్లు, ప్లేగ్రౌండ్లు, సినిమా హాళ్లు, స్విమ్మింగ్‌ పూళ్లు, వెడ్డింగ్‌ హాళ్లు, సమావేశ మందిరాలు ఉండేలా డిజైన్‌ చేశారు.ప్రత్యేకించి విమానం తోక భాగంలో ఉండే భారీ డెక్‌ నుంచి 360 డిగ్రీల కోణంలో పైనున్న అంతరిక్షాన్ని, దిగువనున్న యావత్‌ ప్రపంచాన్ని అతిథులు వీక్షించే ఏర్పాటు ఉండనుంది.విమానం మధ్య భాగం నుంచి లోపలకు వెలుతురు ప్రసరించేలా పూర్తిగా గ్లాస్‌ బాడీతో దీన్ని డిజైన్‌ చేస్తున్నారు.

ఇక ప్రయాణికులు రోజుల తరబడి గాల్లో ప్రయాణించే క్రమంలో వచ్చే మెడికల్ సమస్యలను తీర్చడానికి ఇందులో ఒక అత్యాధునిక వైద్య కేంద్రాన్ని కూడా డిజైన్‌ చేసారండోయ్.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube