తెలుగు రాష్ట్రాల్లో నంబర్‌ వన్‌ ఛానెల్‌గా Ntv

Ntv No.1 Channel: ఎన్టీవీ.( Ntv ) తెలుగు రాష్ట్రాల్లో నంబర్‌ వన్‌ ఛానెల్‌గా తిరుగులేని సత్తాను చాటుతోంది.

24x7 వార్తా ప్రసారాలతో ఎప్పటికప్పుడు ఫాస్ట్‌గా, నిజమైన వార్తలనే ప్రసారం చేస్తూ.ఊకదంపుడు ఉపన్యాసాలకు విరుగుడుగా మంచి కంటెంట్‌తో మరోసారి దూసుకుపోయింది.

ఛానెల్ మొద‌లు పెట్టిన నాటి నుంచే ప్రేక్షకుల ఆద‌ర‌ణ పొందుతూ వ‌చ్చింది.గ్రామం నుంచి ప‌ట్టణం వ‌ర‌కు ఖ‌చ్చిత‌మైన వార్తలు అంటే ఎన్టీవీ అనేంత‌గా ప్రజాద‌ర‌ణ పొందింది.

బ్రేకింగ్ న్యూస్‌ను ఎప్పుడూ లైవ్‌లో ఉండి రిపోర్ట్ చేయ‌డం, ఖ‌చ్చిత‌మైన స‌ర్వేల‌కు ఎన్టీవీ పెట్టింది పేరు.వార్తలంటే కేవ‌లం త‌ప్పుడు ప్రచారాలు, అన‌వ‌స‌ర‌మైన సంచ‌నాలు కాదు,

Advertisement

నిజాన్ని ధైర్యంగా చెప్పగ‌ల‌గ‌డం, ప్రజ‌లకు అవ‌స‌ర‌మైన విష‌యాల్ని వారి దగ్గర‌కు చేర్చడ‌మే అని న‌మ్మిన ఎన్టీవీకి ప్రజ‌లు నెం.1 స్థానాన్ని క‌ట్టబెట్టారు.తాజాగా వెల్లడైన బార్క్ రేటింగ్స్( BARC Ratings ) ప్రకారం ఎన్టీవీ 66.5 టీఆర్పీల‌తో ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. ”ప్రతి క్షణం-ప్రజా హితం” అనే స్లోగ‌న్‌ను పెట్టుకుని, కేవ‌లం దాన్ని స్లోగ‌న్‌గా వ‌దిలేయ‌కుండా ప్రతిక్షణం ఆ మాట‌ మీద ఉండ‌ట‌మే ఎన్టీవీ ఈ స్థానానికి రావ‌డానికి కార‌ణం.

దేనికీ బెద‌ర‌కుండా, ఎవ‌ర్నీ బెదిరించ‌కుండా ప్రజ‌ల పక్షాన నిల‌బ‌డుతుండ‌ట‌మే ఎన్టీవీని తెలుగు మీడియా రంగంలో మేటిగా నిల‌బెడుతుంది.కాగా, ఎన్టీవీ నెం.1గా నిల‌వ‌డంతో ఎన్టీవీ సిబ్బంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు