ఎన్టీఆర్ కాదన్న కథ బ్లాక్బస్టర్, ఒప్పుకున్న దానికి నష్టాలు   NTR’s Rejected Story Turns Blockbuster     2017-10-24   04:27:31  IST  Raghu V

జనతా గ్యారేజ్ తరువాత ఓ రెండు మూడు నెలలపాటు సినిమాలేమి ఒప్పుకోలేదు ఎన్టీఆర్. గ్యాప్ వచ్చిన ఫర్వాలేదు, కాని జనతా గ్యారేజ్ తెచ్చిన ఊపు మళ్ళీ చల్లారకూడదు. పునర్వైభవం పొందేయ్యాలి, ఇదే ఎన్టీఆర్ ప్లాన్. ఆ మార్కేట్ ని పోగొట్టుకూడదనే తేలిగ్గా ఏ సినిమా ఒప్పుకోలేదు. తనకి టెంపర్ లాంటి కెరీర్ చేంజింగ్ సినిమా ఇచ్చిన పూరి జగన్నాథ్ ని కూడా కాదన్నాడు. ఆ సినిమా కథ రాసిన వక్కంతం వంశీ కొన్నేళ్ళుగా డైరెక్షన్ ఛాన్స్ అంటూ తిరుగుతున్నాడు. అతని కథ కూడా విని కదన్నాడు. పటాస్, సుప్రీమ్ లాంటి సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించి సూపర్ ఫామ్ లో అనీల్ రావిపూడి తీసుకొచ్చిన కథను కూడా రిజెక్ట్ చేసాడు. అటు తిరిగి, ఇటు తిరిగి, చివరకి బాబి సినిమా ఓకే చేసాడు. అదే “జైలవకుశ”. ఇక కాదన్న అనీల్ రావిపూడి సినిమా ” రాజా ది గ్రేట్”.

కాని చిత్రం చూడండి, ఎన్టీఆర్ కాదన్న రాజా ది గ్రేట్ సూపర్ హిట్ స్టేటస్ వైపు అడుగులు వేస్తోంది. రవితేజ మార్కేట్ కి తగ్గట్టుగా భారీ వసూళ్ళు సాధిస్తోంది. బయ్యర్లకు లాభాలు తెచ్చిపెట్టేలా ఉంది. మరోవైపు ఎన్టీఆర్ ఏరికోరి ఎంచుకున్న కథ “జైలవకుశ” పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్నా, ఎందుకో అనుకున్నంతగా ఆడలేదు. ఈ సినిమా బిజినెస్ కూడా ఇక ముగిసినట్లే. చేదువార్త ఏమిటంటే, పంపిణిదారులకు ఈ సినిమా వలన నష్టాలే తప్ప, లాభాలైతే లేవు.

వద్దన్న కథకి ఏమో ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. కావాలుకున్న కథ ఏమో నష్టాలు తీసుకొచ్చింది. సినిమా ప్రపంచం అంటేనే ఇంత. ఏది మన ఊహకు అందదు.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.