ఎన్టీఆర్ కథానాయకుడుతో డిస్టిబ్యూటర్స్ కి ఊరట!

ఎన్టీఆర్ బయోపిక్ లో భాగంగా వచ్చిన మొదటి భాగం కథానాయకుడు థియేటర్ లో బయ్యర్లకి ఏకంగా అరవై కోట్ల వరకు నష్టాలు మిగిల్చింది.భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా బిజినెస్ భారీ ఎత్తున జరిగింది.

 Ntrkathanayakudu Buyers Allotted Ntrmahanayakudu Rights-TeluguStop.com

తెలుగు ప్రజలలో ఎన్టీఆర్ పై వున్నా గౌరవం సినిమాకి కలిసొస్తుందని డిస్ట్రిబ్యూటర్స్ భావించి థియాట్రికల్ రైట్స్ లో భారీ ధరకి కొనేసారు.అయితే సినిమా రిలీజ్ తర్వాత థియేటర్ లో మొదటి రోజు నుంచే డివైడ్ టాక్ తెచ్చుకుంది.

సెలబ్రిటీలు అందరూ ముందుకొచ్చి సినిమా గురించి గొప్పగా చెప్పిన కూడా ఆడియన్స్ థియేటర్స్ కి వెళ్ళడానికి ఇష్టపడలేదు.దీంతో పండగ సీజన్ లో కూడా సినిమా ఆశించిన కలెక్షన్స్ ని రాబట్టలేకపోయింది.

దీంతో మొదటి మూడు రోజుల్లోనే కథానాయకుడు సినిమా డిజాస్టర్ అని ఫిక్స్ అయిపోయిన బయ్యర్లు భారీ లాస్ తప్పదని నిర్ణయానికి వచ్చేసారు.

ఇదిలా వుంటే ఎన్టీఆర్ బయోపిక్ లో రెండో భాగమైన మహానాయకుడు సినిమా మీద మొదటి సినిమా ఎఫెక్ట్ భారీగా పడింది.

దీంతో దర్శకుడు క్రిష్ కొన్ని మార్పులు చేర్పులు చేసి సినిమాని ఫిబ్రవరి 22న రిలీజ్ చేయడానికి రంగం సిద్ధం చేసాడు.అయితే కథానాయకుడుతో నష్టపోయిన నిర్మాతలు తమని ఆదుకోవాలని బాలయ్య బాబు దగ్గరకి రావడంతో చివరికి ఈ సినిమా రైట్స్ అన్ని కథానాయకుడుతో నష్టపోయిన బయ్యర్లకి ఇచ్చేందుకు దర్శక, నిర్మాతలు రెడీ అయ్యారు.

అయితే సినిమాని పూర్తిగా ఫ్రీగా ఇవ్వకుండా గత సినిమా నష్టాలు 40 శాతం భరించడానికి ముందుకొచ్చి, మిగిలిన 60 శాతంకి ఈ మహానాయకుడు రైట్స్ ఇవ్వడం జరిగిందని అధికారికంగా కన్ఫర్మ్ చేసారు.అలాగే ఈ సినిమా ఫలితం ఏమైనా తేడా కొడితే బయ్యర్లకి భారీగా దెబ్బ తినకుండా తమవంతు సహకారం అందిస్తామని ఎన్టీఆర్ బయోపిక్ చిత్ర నిర్మాతలు ప్రకటన విడుదల చేసారు.

దీంతో ఈ సినిమా బిజినెస్ ని మొత్తానికి క్రిష్ టీం కథానాయకుడుతో ముడిపెట్టి వదిలిన్చుకున్నట్లు అయ్యింది అని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube