పవర్ స్టార్ తర్వాత యంగ్ టైగర్ తో.. ఇస్మార్ట్ బ్యూటీకి లక్ అలా ఉంది..!

యంగ్ టైగర్ ఎన్.టి.

 Ntr31 Nidhi Agarwal Heroine Chance-TeluguStop.com

ఆర్ ఆర్.ఆర్.ఆర్ సినిమా తర్వాత కొరటాల శివ డైరక్షన్ లో సినిమా ఫిక్స్ చేసుకున్న విషయం తెలిసిందే.త్వరలో సెట్స్ మీదకు వెళ్తున్న ఈ సినిమాలో కియరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది.

ఇక ఈ సినిమా తర్వాత కె.జి.ఎఫ్ డైరక్టర్ ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో తారక్ సినిమా ఉంటుందని తెలుస్తుంది.ప్రశాంత్ నీల్ కె.జి.ఎఫ్ చాప్టర్ 2 పూర్తి చేసే పనిలో ఉన్నాడు.ఈ సినిమా తర్వాత ప్రభాస్ తో సలార్ కూడా సెట్స్ మీదకు తీసుకెళ్లాడు.

 Ntr31 Nidhi Agarwal Heroine Chance-పవర్ స్టార్ తర్వాత యంగ్ టైగర్ తో.. ఇస్మార్ట్ బ్యూటీకి లక్ అలా ఉంది..-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ రెండు సినిమాల తర్వాత ఎన్.టి.ఆర్ సినిమా ఉంటుంది.ఎన్.టి.ఆర్ తో చేస్తున్న సినిమా కూడా పాన్ ఇండియా మూవీగా ప్లాన్ చేస్తున్నాడు.ఈ సినిమాలో హీరోయిన్ గా ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ కు ఛాన్స్ ఇచ్చారట.

ఇస్మార్ట్ శంకర్ హిట్ తర్వాత సూపర్ జోష్ లో ఉన్న నిధి అగర్వాల్ వరుస అవకాశాలు అందుకుంటుంది.ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరి హర వీరమల్లు సినిమాలో నటిస్తున్న అమ్మడు ఎన్.టి.ఆర్, ప్రశాంత్ నీల్ కాంబో మూవీలో కూడా అవకాశం కొట్టేసింది.చూస్తుంటే టాలీవుడ్ లో అమ్మడు టాప్ రేంజ్ హీరోయిన్ గా మారేలా ఉంది.ప్రస్తుతం గల్లా అశోక్ హీరోగా వస్తున్న సినిమాలో కూడా నిధి అగర్వాల్ నటిస్తుంది.

ఓ పక్క యువ హీరోలతో చేస్తూనే స్టార్ సినిమాల్లో ఛాన్సులు అందుకుంటుంది ఈ అమ్మడు.

#Ismart Nidhi #Nidhi Agarwal #Nidhi #NTR31 #NTR31 Updates

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు