తారక్ ఫ్యాన్స్ కోసం ఈసారి కన్ఫం అంటోన్న కొరటాల

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆర్ఆర్ఆర్ రిలీజ్ కాకముందే తన నెక్ట్స్ మూవీని ఇటీవల అనౌన్స్ చేశాడు.గతంలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో తారక్ 30వ చిత్రం వస్తుందని ప్రకటించినా, కొన్ని కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది.

 Ntr30 Update To Be Confirmed This Time, Ntr, Ntr30, Koratala Siva, Tollywood New-TeluguStop.com

ఇక మరో స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తారక్ 30వ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు చిత్ర యూనిట్ అఫీషియల్‌గా అనౌన్స్ చేయడంతో ఈ ప్రాజెక్టుపై అప్పుడే ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో కూడా అదిరిపోయే అంచనాలు క్రియేట్ అవుతున్నాయి.

ఈ సినిమా కోసం కొరటాల ఎలాంటి కథను రెడీ చేశాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

అయితే ఇటీవల తారక్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుండి ఏదైనా అప్‌డేట్ వస్తుందని చిత్ర వర్గాలతో పాటు ప్రేక్షకులు కూడా చాలా ఆశగా చూశారు.కానీ ఆరోజు ఎలాంటి అప్‌డేట్ లేకపోవడంతో నందమూరి అభిమానులు నిరాశకు లోనయ్యారు.

దీంతో ఈ సినిమా నుండి అప్‌డేట్‌ను ఎప్పుడు ప్రకటిస్తారా అని అందరూ ఆసక్తిగా చూస్తు్న్నారు.అయితే ఈ సినిమా దర్శకుడు కొరటాల శివ పుట్టినరోజైన జూన్ 15న ఈ సినిమా నుండి ఏదైనా అప్‌డేట్‌ను ఖచ్చితంగా రిలీజ్ చేస్తారని ప్రేక్షకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

తారక్ పుట్టినరోజున మిస్ అయిన అప్‌డేట్ కొరటాల పుట్టినరోజున ఖచ్చితంగా ఉంటుందని వారు అంటున్నారు.మరి కొరటాల బర్త్‌డే రోజున ఎలాంటి అప్‌డేట్‌ను ఇస్తారా అనేది చూడాలి.

ఇక ఈ సినిమాలో తారక్ సరికొత్త అవతారంలో ప్రేక్షకులకు కనిపిస్తాడని, ఆయన పర్ఫార్మెన్స్ టాప్ లెవెల్‌లో ఉండబోతుందని చిత్ర యూనిట్ అంటోంది.అయితే ఈ సినిమాలో మిగతా నటీనటుల ఎంపిక ఇంకా జరగాల్సి ఉండగా, ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎవరు నటిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube