తారక్ కోసం సముద్రాన్ని రీక్రియేట్ చేస్తున్నారా.. నెక్స్ట్ లెవెల్ అంటూ?

Ntr30 Movie Sets Photos Goes Viral In Social Media Details, Ntr30, Ntr30 Massive Sets, Ntr30 Ocean Sets, Junior Ntr, Director Koratala Shiva, Heroine Janhvi Kapoor, Ntr Koratala Siva Movie

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో మూవీ ఇండస్ట్రీ రికార్డులు బ్రేక్ అయ్యే కాన్సెప్ట్ తో తెరకెక్కుతోందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.కొరటాల శివ ఈ సినిమాకు దర్శకుడు కాగా తారక్ పై ఎంతో అభిమానం ఉన్న ఈ దర్శకుడు మరోసారి తానంటే ఏంటో ఈ సినిమాతో ప్రూవ్ చేసుకుంటానని గట్టి నమ్మకాన్ని కలిగి ఉన్నారు.

 Ntr30 Movie Sets Photos Goes Viral In Social Media Details, Ntr30, Ntr30 Massive-TeluguStop.com

కొరటాల శివ ఈ సినిమా కోసం సముద్రాన్ని రీ క్రియేట్ చేయనున్నారని బోగట్టా.

ఈ సినిమాలో అబ్బురపరిచే సెట్స్ ఉంటాయని తెలుస్తోంది.

ఈ సినిమా కోసం ఎవరూ ఊహించని సెట్స్ వేయనున్నారనే వార్త ఫ్యాన్స్ కు ఒకవైపు సంతోషాన్ని కలిగిస్తుండగా మరోవైపు ఆశ్చర్యానికి గురి చేస్తోంది.ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ ఫిక్స్ అయినా రెమ్యునరేషన్, ఇతర కారణాల వల్ల ఆ విషయాలను వెల్లడించడానికి మేకర్స్ ఇష్టపడటం లేదని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Telugu Koratala Shiva, Janhvi Kapoor, Ntr, Ntr Ocean Sets-Movie

తారక్ కొరటాల శివ కాంబో మూవీ కోసం సాబు సిరిల్ పని చేస్తున్నారు.వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాను తెరకెక్కించనుండగా సముద్రంలో మెజారిటీ సన్నివేశాలు ఉండటంతో సెట్ వేసి గ్రాఫిక్స్ లో సముద్రాన్ని చూపించనున్నారని సమాచారం అందుతోంది.ఫిబ్రవరి ఫస్ట్ వీక్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూట్ మొదలుకానుందని తెలుస్తోంది.పోర్ట్ ఎన్విరాన్మెంట్ ఉండేలా ఈ సెట్ ఉంటుందని బోగట్టా.

Telugu Koratala Shiva, Janhvi Kapoor, Ntr, Ntr Ocean Sets-Movie

ఈ సినిమా పూజా కార్యక్రమానికి మెగా ఫ్యామిలీకి చెందిన పలువురు క్రేజీ హీరోలు హాజరయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.ఆర్.ఆర్.ఆర్ సక్సెస్ తో మెగా హీరోలతో తారక్ కు అనుబంధం పెరిగింది.కొరటాల శివ ఈ సినిమాతో సక్సెస్ సాధిస్తేనే ఆయనకు సినిమా ఆఫర్లు అంతకంతకూ పెరిగే ఛాన్స్ ఉంటుంది.

.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube