తారక్ నెక్స్ట్ సినిమాపై కీలక అప్డేట్... సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఎన్టీఆర్30

నందమూరి హీరో ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నాడు.పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

 Ntr30 Movie Big Announcement-TeluguStop.com

భారీ బడ్జెట్ తో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కొమరామ్ భీమ్ పాత్రలో ఎన్టీఆర్ కనిపించబోతున్నాడు.ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత తారక్ ఇప్పటికే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు.

ఈ సినిమా షూటింగ్ మే, జూన్ లో స్టార్ట్ అయ్యే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తుంది.త్వరలో దీనికి సబందించిన అప్డేట్ కూడా వస్తుందని చిత్ర నిర్మాతలు ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు.

 Ntr30 Movie Big Announcement-తారక్ నెక్స్ట్ సినిమాపై కీలక అప్డేట్… సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఎన్టీఆర్30-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

త్రివిక్రమ్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతుంది.ఇదిలా ఉంటే ఇప్పుడు ఎన్టీఆర్ 30వ సినిమా గురించి కీలక అప్డేట్ రానుందని తెలుస్తుంది.

ఈ నేపధ్యంలో ఎన్టీఆర్30 అనే హ్యాష్ ట్యాగ్ ప్రస్తుతం ట్విట్టర్ లో ట్రెండ్ అవుతుంది.

గతంలో జనతా గ్యారేజ్ తర్వాత తారక్, కొరటాల కాంబినేషన్ లో మరో మూవీ వస్తుందని అందరూ భావించారు.

అయితే ఆ టైంలో అది సెట్ కాలేదు.అయితే ఇప్పుడు కొరటాల దర్శకత్వంలో ఎన్టీఆర్ 30వ సినిమా రాబోతుందని తెలుస్తుంది, ఇక ఈ సినిమా ద్వారా కొరటాల స్నేహితుడు మిక్కిలినేని సుధాకర్ పూర్తి స్థాయి నిర్మాతగా మారుతున్నాడు.

యువసుధ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కబోతుందని తెలుస్తుంది.ఈ కాంబినేషన్ గురించే ఈ రోజు అప్డేట్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.అయితే ప్రస్తుతం త్రివిక్రమ్ మూవీకి సంబంధించి టైటిల్ లేదంటే హీరోయిన్ ప్రకటన ఉండే అవకాశం ఉందని మరో టాక్ కూడా నడుస్తుంది.అయితే వీటిలో ఏంటి అనేది ఈ రోజు తెలిసే అవకాశం ఉంది.

#Koratala Siva

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు