నిలిచిపోనున్న ఎన్టీఆర్ వైద్య సేవ... కారణం ఇదే !

ఏపీలో ఎన్నికల తరుణం ముంచుకొస్తుండడంతో … ప్రభుత్వం నుంచి రావాల్సిన మొండి బకాయిలతో పాటు … తమ తమ డిమాండ్లు సాధించుకునే దిశగా అడుగులు వేస్తున్నారు.తాజాగా… ఎన్టీఆర్ వైద్య సేవ, ఆరోగ్య రక్షణ, ఉద్యోగులు, జర్నలిస్టులకు అందించే నగదు రహిత వైద్య సేవలు రేపటి నుండి నిలిపివేస్తున్నారు.ఈ పథకానికి సంబంధించి ఆసుపత్రులకు ప్రభుత్వం ఇప్పటి వరకు 500 కోట్లు బకాయిపడిందని, అవన్నీ క్లియర్ చేస్తేనే … వైద్యసేవలు కొనసాగించగలమని ఆంధ్రప్రదేశ్ ఆసుపత్రుల అసోసియేషన్(ఆషా) స్పష్టం చేసింది.

 Ntr Vaidhya Seva Services To Stop From Tomorrow-TeluguStop.com

కానీ… అత్యవసర వైద్య సేవలు మాత్రం కొంతకాలం కొనసాగుతాయని అసోసియేషన్ డైరెక్టర్ వి.మురళీకృష్ణ తెలిపారు.ఈ వైద్య సేవల కింద దాదాపు 450 ఆసుపత్రులకు ప్రభుత్వం 500 కోట్ల వరకు బకాయలు పడిందని, అవన్నీ చెల్లించాలని మురళీకృష్ణ డిమాండ్ చేశారు.

నెలరోజులలో ఈ బకాయిలు అన్ని చెల్లించాలని, లేదంటే వైద్యసేవలు నిలిపివేస్తామని ఇప్పటికే ఎన్నోసార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లామని, కానీ ఎటువంటి స్పందన లేకపోవటంతో రేపటి నుండి సేవలు నిలిపివేస్తున్నట్టు వారు స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube