ఎన్టీఆర్‌30లో ఆ కమెడియన్‌ కీలక పాత్ర

ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలో రామ్‌ చరణ్‌

మరియు ఎన్టీఆర్‌లు కలిసి నటిస్తున్న విషయం తెల్సిందే.రాజమౌళి ఒక అద్బుత దృశ్య కావ్యం అన్నట్లుగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

 Sunil Act In Power Full Character In Trivikram And Ntr Movie, Ntr Rrr, Trivikram-TeluguStop.com

భారీ అంచనాల నడుమ రూపొందబోతున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా ఆలియా భట్‌ నటిస్తుంది. ఈ చిత్రం షూటింగ్‌ దాదాపుగా 80 శాతంకు పైగా పూర్తి అయ్యింది.

ఈ లాక్‌డౌన్‌ లేకుండా ఉండి ఉంటే మే వరకు షూటింగ్‌ పూర్తి చేసేవారు.కాని ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సినిమా చాలా ఆలస్యం అయ్యేలా ఉంది.

ఎన్టీఆర్‌ ఆ చిత్రం నుండి ఎప్పుడు ఫ్రీ అయితే అప్పుడు త్రివిక్రమ్‌ సినిమా చేయాల్సి ఉంది.ఎన్టీఆర్‌తో ఇప్పటికే అరవింద సమేత చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు త్రివిక్రమ్‌ ఈసారి మరింత బలమైన కమర్షియల్‌ హిట్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు.

వచ్చే ఏడాదిలో సినిమాను విడుదల చేసేలా ప్లాన్‌ చేస్తున్నారు.ఇక ఈ చిత్రంలో ఒక కీలక పాత్రకు గాను సునీల్‌ను ఎంపిక చేస్తున్నాడు. అరవింద సమేత చిత్రంతో పాటు త్రివిక్రమ్‌ పలు చిత్రాల్లో సునీల్‌ ఉన్నాడు. అయితే సునీల్‌ కెరీర్‌ ఈమద్య కాలంలో చాలా డల్‌గా ఉంది.

Telugu Ntr Rrr, Rajamouli, Ramcharan, Suniltrivikram, Sunilaravaindha, Trivikram

సునీల్‌కు మంచి స్నేహితుడు అయిన త్రివిక్రమ్‌ ఎట్టి పరిస్థితుల్లో ఆయనకు కెరీర్‌ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు.అందుకే ఎన్టీఆర్‌ 30 చిత్రంలో చాలా కీలకమైన పాత్రను సునీల్‌తో చేయించాలని త్రివిక్రమ్‌ నిర్ణయించుకున్నాడట. సునీల్‌ కెరీర్‌కు తోడ్పాటును అందించేందుకు ఏకంగా ఎన్టీఆర్‌ 30 సినిమాలో దాదాపుగా సెకండ్‌ హీరో పాత్రను ఇవ్వాలనే నిర్ణయానికి త్రివిక్రమ్‌ వచ్చాడట. ఇందుకు ఎన్టీఆర్‌ ఒప్పుకుంటాడా అనేది అనుమానమే.

కాని త్రివిక్రమ్‌తో మూవీ కోసం ఎన్టీఆర్‌ దీనికి సరే అనే అవకాశం ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube