త్రివిక్రమ్‌పై తారక్ ఫైర్.. ఎందుకంటే?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఇటీవల స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో కలిసి ‘అల వైకుంఠపురములో’ చిత్రంతో స్టన్నింగ్ సక్సె్స్‌ను అందుకున్నారు.ఈ సినిమా ఇచ్చిన బూస్ట్‌తో తన నెక్ట్స్ మూవీని రెడీ చేసేందుకు త్రివిక్రమ్ రెడీ అవుతున్నాడు.

 Ntr Angry On Trivikram, Ntr, Trivikram, Ntr30, Rrr, Tollywood News-TeluguStop.com

ఇప్పటికే యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో కలిసి తన నెక్ట్స్ మూవీని అఫీషియల్‌గా లాంఛ్ చేశాడు త్రివిక్రమ్.తారక్ 30వ చిత్రంగా రానున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను త్వరలో ప్రారంభించేందుకు ఆయన రెడీ అవుతున్నాడు.

కాగా ఈ సినిమా షూటింగ్ అనుకున్న దానికంటే కూడా ఎక్కువ ఆలస్యం అవుతుండటంతో త్రివిక్రమ్ ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.అయితే తారక్ నటిస్తున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం ఇప్పటికే చాలా సమయాన్ని తీసుకుంటున్నాడు.

దీంతో సినిమా షూటింగ్ మరింత ఆలస్యం అవుతుందని భావించిన త్రివిక్రమ్, తారక్‌తో తన సినిమా మొదలయ్యే వరకు వేరే హీరోతో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు.ఈ క్రమంలోనే ఆయన ఓ చిన్న సినిమాను తెరకెక్కించాలని చూస్తున్నాడు.

ఇప్పటికే దీనికి సంబంధించి ఓ కథను రెడీ కూడా చేశాడట.అయితే ఆ కథను కొంత మంది హీరోలకు వినిపించాలని త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడు.

ఇదే విషయాన్ని తారక్‌తో కూడా చెప్పాడట.కానీ తారక్‌కు ఈ విషయం పెద్దగా నచ్చలేదని తెలుస్తోంది.

దీంతో త్రివిక్రమ్ తనతో సినిమా చేయకముందే మరో సినిమా చేయడం ఏమాత్రం ఇష్టం లేదని తేల్చి చెప్పాడట.అయినా కూడా త్రివిక్రమ్ ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతుండటంతో త్రివిక్రమ్‌పై ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ ముగిసే లోపు త్రివిక్రమ్ సినిమాకు సంబంధించి రెండు షెడ్యూల్స్‌ను పూర్తి చేయాలని భావిస్తున్నాడట.మరి ఈ సినిమాను ఆయన ఎప్పుడు పట్టాలెక్కిస్తాడో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube