ఎన్టీఆర్ - త్రివిక్ర‌మ్ టైటిల్ వ‌చ్చేసింది..       2018-05-19   02:20:52  IST  Raghu V

మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ – టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ కాంబినేష‌న్‌లో సినిమా అంటే ఎలాంటి అంచ‌నాలు ఉంటాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఇంకా చెప్పాలంటే ఈ కాంబినేష‌న్‌లో సినిమా కోసం టాలీవుడ్ సినీ జ‌నాలు అంద‌రూ దాదాపు ద‌శాబ్దం కాలానికి పైగా వెయిటింగ్‌లో ఉన్నారు. ఎట్ట‌కేల‌కు గ‌తేడాది చివ‌ర్లో ప‌వ‌న్‌క‌ళ్యాణ్ చేతుల మీదుగా ప్రారంభోత్స‌వం జ‌రుపుకున్న ఈ సినిమా నాలుగైదు నెల‌లు గ్యాప్ తీసుకుని సెట్స్‌మీద‌కు వెళ్లింది.

సూప‌ర్ క్రేజీ కాంబినేష‌న్ కావ‌డంతో ఈ సినిమా సెట్స్‌మీద‌కు వెళ్లిన‌ప్ప‌టి నుంచి ఈ ప్రాజెక్టు గురించి ఏ చిన్న వార్త వ‌చ్చినా ఆస‌క్తిగానే ఉంటోంది. హీరోయిన్లు, ఇత‌ర సాంకేతిక నిపుణులు ఇలా ప్ర‌తి ఒక్క‌టి సంచ‌ల‌న‌మ‌వుతూనే వ‌స్తోంది. ఇక ఈ సినిమాకు ఎలాంటి టైటిల్ ఉంటుంద‌న్న‌ది పెద్ద స‌స్పెన్స్‌గా ఉంది. శ‌నివారం సాయంత్రం టైటిల్, లోగో ఎనౌన్స్ చేస్తోన్న సంగ‌తి తెలిసిందే.

విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమా టైటిల్ ఇండ‌స్ట్రీ ఇన్న‌ర్ స‌ర్కిల్స్ ద్వారా ముందే లీక్ అయ్యింది. సాయంత్రం 4.50 గంట‌ల‌కు టైటిల్ లీక్ అవుతుండ‌డంతో ఎన్టీఆర్ అభిమానులు అయితే తెగ టెన్ష‌న్ ప‌డిపోతున్నారు. త్రివిక్ర‌మ్ ఎలాంటి టైటిల్ పెడ‌తాడా ? అని వెయిటింగ్‌లో ఉన్నారు. ఇక లీక్ అయిన టైటిల్ ప్రకారం అరవింద సమేత వీర రాఘవ అనిఒక టైటిల్ ఫైన‌లైజ్ కాబోతున్న‌ట్టు తెలుస్తోంది.

ఇక టైటిల్ చూస్తేనే త్రివిక్ర‌మ్ త‌న మార్క్ చూపించాడ‌ని తెలుస్తోంది. ఈ సినిమాలో పూజా హెగ్డే, శ్ర‌ద్ధా క‌పూర్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. కంటిన్యూగా షూటింగ్ జ‌రిపి వ‌చ్చే ద‌స‌రాకు ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రావాల‌ని చూస్తున్నారు. అజ్ఞాత‌వాసి సినిమాతో రేసులో వెన‌క‌ప‌డ్డ త్రివిక్ర‌మ్ ఈ సినిమాను క‌సితో తెర‌కెక్కిస్తున్నారు.