ఎన్టీఆర్ త్రివిక్రమ్ మూవీ స్టార్ట్ అయ్యేది అప్పుడేనా..?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో అయినను పోయిరావలె హస్తినకు పేరుతో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.అరవింద సమేత హిట్ తరువాత త్రివిక్రమ్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు వేరే టైటిళ్లు కూడా వినిపించినా చివరకు ఇదే టైటిల్ ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది.

 Junior Ntr Trivikram Movie Starts From May 20 Onwards -jr Ntr-thrivikram-tollywo-TeluguStop.com

సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ చౌడప్ప నాయుడు అనే పాత్రలో నటిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.

అయితే ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు.

ఈ సినిమాలో కొమురం భీమ్ పాత్రలో నటిస్తున్న ఎన్టీఆర్ ఆ పాత్ర కోసం తన లుక్ ను మార్చుకున్నారు.ఇకపోతే ఎన్టీఆర్ త్రివిక్రమ్ మూవీ షూటింగ్ ఈ ఏడాది మే నెల 20వ తేదీ నుంచి ప్రారంభం కానుందని తెలుస్తోంది.

వచ్చే ఏడాది సంక్రాంతి టార్గెట్ గా ఈ సినిమా తెరకెక్కుతోందని సమాచారం.మే 20వ తేదీన జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.

మొదట మార్చి నెల నుంచే ఎన్టీఆర్ త్రివిక్రమ్ మూవీ ప్రారంభమవుతుందని వార్తలు వినిపించినా రెండు నెలలు ఆలస్యంగా ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం.త్రివిక్రమ్ ప్రస్తుతం అయ్యప్పనుమ్ కోషియమ్ మూవీ రీమేక్ లో కథ, కథనంలో కీలక మార్పులు చేయడంతో పాటు ఈ సినిమాకు మాటల రచయితగా వ్యవహరిస్తున్నారు.

అల వైకుంఠపురములో లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది.

Telugu Jr Ntr, Ntr-Movie

పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ లకు ఇండస్ట్రీ హిట్లు ఇచ్చిన త్రివిక్రమ్ ఎన్టీఆర్ కు కూడా ఇండస్ట్రీ హిట్ ఇస్తాడని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు.ఆర్ఆర్ఆర్ మూవీ విడుదలైన కొన్ని నెలలకే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube