త్రివిక్రమ్‌తో 100 దాటిన తారక్..?  

Ntr Trivikram Movie Budget Rs 125 Crores 100 - Telugu Budget, Ntr, Rashmika Mandanna, Trivikram

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్‌లో ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.భారీ బడ్జెట్‌తో బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీగా ఈ సినిమా తెరకెక్కుతుండటంతో ఈ సినిమా కోసం యావత్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 Ntr Trivikram Movie Budget Rs 125 Crores 100

అయితే ఈ సినిమా షూటింగ్ ముగియక ముందే తారక్ తన నెక్ట్స్ మూవీని కూడా ప్రారంభించాడు.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో కలిసి అరవింద సమేత వీరరాఘవ అనే సినిమాతో అదిరిపోయే హిట్ అందుకున్న తారక్, మరోసారి ఆయనతో సినిమా చేయనున్నాడు.

త్రివిక్రమ్‌తో 100 దాటిన తారక్..-Gossips-Telugu Tollywood Photo Image

ఈ సినిమాకు సంబంధించిన ప్రారంభోత్సవం కూడా ఇప్పటికే జరిగిపోయింది.కాగా ఈ సినిమాను పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించేందుకు త్రివిక్రమ్ రెడీ అవుతున్నాడు.ఇక ఈ సినిమాకు తారక్, త్రివిక్రమ్ భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.

అల వైకుంఠపురములో సినిమాకు త్రివిక్రమ్ రూ.15 కోట్లు తీసుకోగా, ఈ సినిమా కోసం ఏకంగా రూ.20 కోట్లు తీసుకుంటున్నాడట.అటు తారక్ ఈ సినిమా కోసం రూ.40 కోట్లు పుచ్చుకుంటున్నాడట.దీంతో ఈ సినిమా బడ్జెట్‌లో సగం వీరిద్దరే తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.కాగా ఈ సినిమాను రూ.125 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.అయినను పోయి రావలే హస్తినకు అనే టైటిల్‌తో రానున్న ఈ సినిమాలో పూజా హెగ్డే, రష్మిక మందన్న హీరోయిన్‌లుగా నటిస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు