బాలయ్యకు ఎన్టీఆర్ మద్దతిస్తే ?  

Ntr To Support Balakrishna - Telugu Balakrishna, Chandrababu Naidu, Hindupur Mla, Jr Ntr, Nandamuri Sons, Ntr To Support Balayya, Tdp

సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వ్యవహారం కొద్దిరోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే.సినీ ఇండస్ట్రీలో ఏర్పడిన వివాదానికి బాలయ్య కారణం కావడంతో ఇప్పుడాయన చాలామందికి టార్గెట్ అవ్వడంతో పాటు , ఆయనను వేలెత్తి చూపే వారు ఎక్కువయ్యారు.

 Ntr To Support Balakrishna

ఇదిలా ఉంటే బాలయ్య ఒకవైపు రాజకీయాల్లో, మరో వైపు సినిమాల్లో యాక్టివ్ గా ఉంటున్నారు.రాజకీయాల కంటే సినిమాలపై ఎక్కువ దృష్టి పెట్టారు.

తన తండ్రి స్థాపించిన తెలుగుదేశం పార్టీలో బాలకృష్ణ ఒక సాధారణ ఎమ్మెల్యే గానే మిగిలిపోయారు.తన తండ్రి స్థాపించిన పార్టీలో బాలయ్య చక్రం తిప్పే అవకాశం ఉన్నా, ఆయనకు అంత రాజకీయ అనుభవం లేకపోవడం, టిడిపిలో పెద్దగా మద్దతిచ్చే వారు లేకపోవడం వంటి పరిణామాలతో ఆయన ఇలా ఒంటరిగా మిగిలిపోయారు.

బాలయ్యకు ఎన్టీఆర్ మద్దతిస్తే -Political-Telugu Tollywood Photo Image

ఇప్పటికే నందమూరి వారసులు హరికృష్ణ టిడిపిలో కొన్ని పదవులు అనుభవించారు.ఇక బాలయ్య ఎమ్మెల్యేగా తప్ప పార్టీ పొలిట్ బ్యూరో లో కూడా చోటు సంపాదించుకోలేక పోయారు.

మొత్తం చంద్రబాబు కనుసన్నల్లోనే పార్టీ నడుస్తోంది.ఇక బాలయ్య కూడా తను ఎందుకు వచ్చింది లే అన్నట్టుగా ఎక్కువ సినిమాలపై ద్రుష్టి పెట్టారు.

ఇక బాలకృష్ణ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కు మంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది.ఒకరకంగా చెప్పుకుంటే బాలయ్య కంటే జూనియర్ ఎన్టీఆర్ కే అభిమానులు ఎక్కువ అని చెప్పుకోవాలి.

అతి తక్కువ వయస్సులోనే మంచి స్థానానికి ఎన్టీఆర్ చేరిపోయారు.

ఆయన కూడా చంద్రబాబు వైఖరి కారణంగా, తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు.గతంలో ఆ పార్టీకి ప్రచారం చేసినా, చంద్రబాబు ఆ తర్వాత పట్టించుకోకపోవడం వంటి పరిణామాలతో జూనియర్ దూరంగానే ఉంటూ వస్తున్నారు.అయితే జూనియర్ ఎన్టీఆర్ కు బాలకృష్ణ అంటే విపరీతమైన అభిమానం.

ఆయన ఏది చెప్పినా తూచా తప్పకుండా పాటిస్తారు.అంతగా ఆయన బాలయ్యను అభిమానిస్తారు.

ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ ను చంద్రబాబు పక్కన పెట్టారు.కానీ బాలయ్య జూనియర్ ఎన్టీఆర్ ను ప్రచారానికి పిలిస్తే ఆయన బాలయ్య మాటను కాదనే అవకాశం లేదు.

వచ్చే ఎన్నికల నాటికి అది కూడా జరిగే అవకాశం కనిపిస్తోంది.

ఇక ప్రస్తుతం బాలయ్య సినిమాల్లో బిజీగా ఉన్నా, రానున్న రోజుల్లో సినిమాలకు బ్రేక్ వేసే ఛాన్స్ కనిపిస్తోంది.

అప్పుడు రాజకీయంగా ఉన్నత స్థానానికి వెళ్లాలనే ఆలోచనతో ఉన్నట్లుగా కనిపిస్తున్నారు.వయసు రీత్యా చంద్రబాబు మరికొద్ది రోజుల్లో రిటైర్మెంట్ తీసుకునే అవకాశం ఉండడంతో టిడిపిలో బాలయ్య చక్రం తిప్పాలని చూస్తున్నారు.

ఆయనకు కనుక జూనియర్ ఎన్టీఆర్ మద్దతు ఇచ్చి ప్రత్యక్షంగా బాలయ్యతో కలిసి ఎన్టీఆర్ రాజకీయాల్లోకి దిగితే అప్పుడు నందమూరి హవా మళ్లీ తెలుగుదేశం పార్టీలో పెరగడంతోపాటు, పార్టీలో చక్రం తిప్పే విధంగా బాలయ్య ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test