మాస్టర్ కోసం తారక్ ఏం చేస్తున్నాడంటే..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ టాలీవుడ్‌లో కేవలం నటనతోనే కాకుండా ఆయన డ్యాన్స్, పాటలతో కూడా మల్టీ ట్యాలెంటెడ్ హీరోగా తనదైన ముద్ర వేసుకున్నాడు.డ్యాన్స్, సాంగ్స్, యాక్టింగ్ ఇలా అన్ని అంశాల్లో తనదైన శైలితో ప్రేక్షకులను అలరిస్తున్న తారక్, తన సినిమాల్లో పాటలు పాడిన సందర్భాలు కూడా ఉన్నాయి.

 Ntr To Sing Song For Vijay Master Movie-TeluguStop.com

అయితే తెలుగులో కాకుండా ఇతర భాషల్లో సైతం పాటలు పాడి మెప్పించిన తారక్ మరోసారి గాయకుడి అవతారమెత్తనున్నాడు.

తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న తాజా చిత్రం మాస్టర్, ఇప్పటికే మెజారిటీ శాతం షూటింగ్‌ను ముగించుకుంది.

ఈ సినిమాలో కుట్టి అనే పాటను ఇటీవల చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.ఈ పాటను విజయ్ స్వయంగా పాడటంతో అక్కడ ఈ పాట దుమ్ములేపుతోంది.కాగా మాస్టర్ తెలుగు వర్షన్‌లో ఈ పాటను యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో పాడించాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.దీనికి సంబంధించన సంప్రదింపులు కూడా జరుగుతున్నాయట.

అసలే పాటలను తనదైన స్టైల్‌లో పాడి సక్సెస్ కొట్టడం తారక్‌కు వెన్నెతో పెట్టిన విద్య అని, ఇక విజయ్ లాంటి స్టార్ హీరో పాటకు ఆయన ఏ రేంజ్‌లో పాడుతాడో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు అంటున్నారు ఫ్యాన్స్.గటంలో కన్నడ హీరో పునీత్ రాజ్ కుమార్ కోసం కన్నడలో గెలయా గెలయా అంటూ అదిరిపోయే పాటను పాడిన తారక్, విజయ్ కోసం ఎలాంటి పాటతో వస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube