మీరా చోప్రాకు ఎన్టీఆర్‌ సారీ చెప్పాలా?  

Ntr To Say Sorry Meera Chopra Fans - Telugu Meera Chopra, Ntr Fans, Ntr Fans Bad Comments, Ntr To Sorry To Meera Chopra, Police Case On Ntr Fans, Twitter

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ గత రెండు రోజులుగా హీరోయిన్‌ మీరా చోప్రాను టార్గెట్‌ చేసి సోషల్‌ మీడియాలో బెదిరింపులకు పాల్పడుతున్నారు.కొందరు బూతులు తిడుతూ ఆమెను మానసికంగా వేదిస్తున్నారు.

 Ntr To Say Sorry Meera Chopra Fans

మొత్తానికి ఎన్టీఆర్‌ ఎవరో తెలియదు అన్నందుకు మీరా చోప్రాకు గత రెండు రోజులుగా నిద్ర కూడా లేకుండా నెటిజన్స్‌ ఆమెను టార్గెట్‌ చేశారు.ఈ విషయంలో ఆమె ఇప్పటికే పోలీసులకు ఈమెయిల్‌ ద్వారా ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది.

మీరా చోప్రా ఫిర్యాదును నమోదు చేసిన పోలీసులు ఎంక్వౌరీ ప్రారంభించారు.ఈ సమయంలో ఎన్టీఆర్‌ అభిమానులు ఇరుకున పడ్డారు.ఆమె ట్వీట్‌కు కామెంట్స్‌ పెట్టిన వారు అంతా కూడా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది.వందలాది మంది ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ ఇప్పుడు కేసులో చిక్కుకున్నారు.

మీరా చోప్రాకు ఎన్టీఆర్‌ సారీ చెప్పాలా-Movie-Telugu Tollywood Photo Image

ఇలాంటి సమయంలో అభిమానులు తెలియక చేసిన తప్పుకు ఎన్టీఆర్‌ స్వయంగా మీరా చోప్రాతో మాట్లాడి కేసు ఉపసంహరించుకునేలా చేయాంటూ కొందరు విజ్ఞప్తి చేస్తున్నారు.

మీరా చోప్రాతో ఎన్టీఆర్‌ మాట్లాడితే సమస్యకు పరిష్కారం లభిస్తుందని చాలా మంది అనుకుంటూ ఉంటే కొందరు మాత్రం చీప్‌గా ఆమెతో ఎన్టీఆర్‌ మాట్లాడటం ఏంటీ, ఆమెకు సారీ చెప్పి కేసు ఉపసంహరించుకోవాల్సిందిగా కోరడం ఏంటీ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఎన్టీఆర్‌ తెలియదు అంటూ మరోసారి ఏ హీరోయిన్‌ అవాకులు పేలకుండా ఉండాలి అంటూ ఇలాంటి సంఘటన ఒకటి జరగాల్సిందే.ఎన్టీఆర్‌ అభిమానులు ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, వారికి న్యాయపరమైన సహాయం అందుతుందని కొందరు హామీ ఇస్తున్నారు.

మొత్తానికి ఈ విషయం ఎక్కడ నుండి తిరిగి ఎక్కడకు చేరుతుందో అనే ఆందోళన అయితే కనిపిస్తుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test