ఆ రికార్డు కొట్టే మొట్టమొదటి మొనగాడు తారక్  

NTR To Become First Ever Hero For That Record, NTR, Ramaraju For Bheem, Bheem Teaser, RRR, Rajamouli, Youtube - Telugu Bheem Teaser, Ntr, Rajamouli, Ramaraju For Bheem, Rrr, Youtube

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఉన్నారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.బాహుబలి లాంటి బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ తరువాత రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ఆర్ఆర్ఆర్ ఎలాంటి విధ్వంసాన్ని సృష్టిస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

TeluguStop.com - Ntr To Become First Ever Hero For That Record

ఇక ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో ఏర్పడ్డాయి.

ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా, ఇప్పటికే ఆయన పాత్రకు సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేయగా, దానికి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

TeluguStop.com - ఆ రికార్డు కొట్టే మొట్టమొదటి మొనగాడు తారక్-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఇక తాజాగా ఎన్టీఆర్ కొమురం భీం పాత్రకు సంబంధించిన టీజర్‌ను అక్టోబర్ 22న రిలీజ్ చేశారు.ఈ టీజర్‌లో తారక్ తన ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్ ఇచ్చాడు.

పూర్తి మేకోవర్‌తో తారక్‌ను దర్శకధీరుడు చూపెట్టిన విధానం వావ్ అనిపించేలా ఉండటంతో ఈ టీజర్‌కు రికార్డుస్థాయిలో వ్యూస్ లభిస్తున్నాయి.ఇక యూట్యూబ్‌లో ఈ టీజర్ చేస్తున్న రచ్చ మామూలుగా లేదు.

ముఖ్యంగా ఈ టీజర్‌ తెలుగులో ఫస్ట్ ఎవర్ 1 మిలియన్ లైకులు సాధించిన టీజర్‌గా నిలవనుంది.ఇప్పటికే 9 లక్షల లైకులు సాధించిన ఈ టీజర్ మిలియన్ లైకులు తెచ్చుకోవడం కన్ఫం అని చెప్పొచ్చు.

తెలుగులో ఇలాంటి ఫీట్ కొట్టిన తొలి హీరోగా తారక్, తొలి టీజర్‌గా భీం నిలవనుంది.మొత్తానికి రికార్డుల వేటను ఆర్ఆర్ఆర్ ఈ టీజర్ నుండే ప్రారంభించిందనడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పాలి.

ఇక ఈ సినిమాలో తారక్ సరసన ఒలివియా మారిస్, చరణ్ సరసన ఆలియా భట్‌లు హీరోయిన్లుగా నటిస్తుండగా, ఈ సినిమా షూటింగ్‌ను రీసెంట్‌గా తిరిగి ప్రారంభించారు.ఈ సినిమాను 2021 వేసవి కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

మరి ఈసారైనా అనుకన్న సమయానికి ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని రిలీజ్ చేస్తారా లేదా అనేది చూడాలి.

#Youtube #Bheem Teaser #Rajamouli

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Ntr To Become First Ever Hero For That Record Related Telugu News,Photos/Pics,Images..