ఎన్టీఆర్, బాలయ్యకు ఆ హీరో తల్లే వైద్యం చేసేదట!  

ntr that heros mother is healing balayya , sathyam sivam movie, bhanuchander, ntr, balayya - Telugu Balayya, Bhanuchander, Ntr, Sathyam Sivam Movie

తెలుగు సినీ నటుడు బానుచందర్ అందరికీ ఎంతో పరిచయం ఉన్న వ్యక్తి.నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు.

TeluguStop.com - Ntr That Heros Mother Is Healing Balayya

అప్పట్లో కళాతపస్వి కె.విశ్వనాథ్ దర్శకత్వం నుంచి ప్రముఖ దర్శక ధీరుడు రాజమౌళి వరకు రెండు తరాల దిగ్గజ డైరెక్టర్లతో పని చేసిన అనుభవం భానుచందర్ కి ఉంది.ఇప్పటికి కూడా భానుచందర్ కు తెలుగులో అవకాశాలు రావడం విశేషం.ఈ సందర్భంగా తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో భాగంగా భానుచందర్ మాట్లాడుతూ ఇండస్ట్రీలో ఎన్టీఆర్,ఏఎన్నార్‌తో తనకున్న అనుబంధం గురించి తెలియజేశాడు.

‘సత్యం శివం’ సినిమాలో ఎన్టీఆర్, ఏఎన్నార్‌తో కలిసి నటించడం తనకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పాడు.”నేను ఎక్కడ కూర్చుంటే నువ్వు అక్కడ కూర్చోవాలి.నేను ఏం తింటే నువ్వు అదే తినాలని రూల్స్ ఎన్టీఆర్ పెట్టినట్లు భానుచందర్ తెలిపారు.ఈ విధం ఎన్టీఆర్ తనకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చేవాడని భానుచందర్ తెలిపారు.

TeluguStop.com - ఎన్టీఆర్, బాలయ్యకు ఆ హీరో తల్లే వైద్యం చేసేదట-General-Telugu-Telugu Tollywood Photo Image

ఈ విధంగా ఎన్టీఆర్ అంత ప్రాధాన్యత ఇవ్వడానికి గల కారణం తన తల్లి అని భానుచందర్ చెప్పాడు.

Telugu Balayya, Bhanuchander, Ntr, Sathyam Sivam Movie-Movie

ఎన్టీఆర్ మా అమ్మను అక్కయ్య అని, మా అమ్మ ఎన్టీఆర్ ను అన్నయ్య అని పిలుచుకునేవారు.ఒక రోజు తెల్లవారుజామున ఎన్టీఆర్ దగ్గర నుంచి మా ఇంటికి ఫోన్ వచ్చింది.అక్కయ్య గారు మాకు పచ్చకామెర్లు వచ్చాయి.

మీరు మందు ఇస్తారని తెలిసింది.మీ ఇంటికి ఎప్పుడు రమ్మంటావు అని అడిగారు.

అప్పుడు మా అమ్మ మీరు ఎందుకు అన్నయ్య నేనే మీ ఇంటికి రేపు ఉదయం 4:30 వస్తాను అని చెప్పడంతో నేను సిద్ధంగా ఉంటానని తెలిపారు.అప్పుడు మా అమ్మ రెండు వేడి వేడి ఇడ్లీలలో పచ్చకామెర్ల మందు కలిపి మూడు రోజులపాటు ఎన్టీఆర్ కు ఇచ్చింది.

మూడు రోజుల తర్వాత తనకు కామెంర్లు తగ్గిపోయినట్లు బానుచందర్ తెలిపారు.

తరువాత బాలకృష్ణ గారికి కూడా కామెర్లు రావడంతో ఆస్పత్రికి వెళ్ళమంటే.

అప్పుడు ఎన్టీఆర్ ఆస్పత్రికి ఎందుకు మా అక్కయ్య ఉన్నారు కదా మందిస్తారని బాలకృష్ణ గారిని మా ఇంటికి పంపించారు.ఆ విధంగా మా అమ్మ ఎంతోమందికి పచ్చకామెర్లకు ఉచితంగా మందు ఇచ్చేదని ఈ ఇంటర్వ్యూ ద్వారా భానుచందర్ గుర్తు చేసుకున్నాడు.

#Bhanuchander #SathyamSivam #Balayya

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు