ఆ కోపంతోనే టీడీపీకి దూరంగా ఎన్టీఆర్ ?

తెలుగుదేశం పార్టీ లోకి రీఎంట్రీ ఇచ్చే విషయంలో ఎన్టీఆర్ పేరు పదే పదే ప్రస్తావనకు వస్తోంది.ప్రస్తుతం టీడీపీ ఉన్న పరిస్థితుల్లో ఎన్టీఆర్ మాత్రమే ఆ పార్టీని ముందుకు తీసుకెళ్లగలరు అనే అభిప్రాయం ఆ పార్టీ సీనియర్ నాయకులతో పాటు, రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

 Jr.ntr Maintain The Long Distance With Tdp Party About Tdp Insult With Hari Kris-TeluguStop.com

చాలా కాలం నుంచి ఎన్టీఆర్ తెలుగుదేశంలో మళ్లీ యాక్టివ్ అవ్వాలంటూ టీడీపీ అభిమానులంతా పదే పదే కోరుతున్నారు.సీనియర్ ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు పార్టీ పగ్గాలు చేపట్టి సమర్థవంతంగా పార్టీని ముందుకు తీసుకు వెళ్లారని, ఇక ఆయన వయస్సు పైబడటంతో ఇక ఎంతోకాలం పార్టీలో యాక్టివ్ గా ఉండే పరిస్థితి లేదని అలాగే, చంద్రబాబు తర్వాత ఆ పార్టీ సమర్థవంతంగా ముందుకు తీసుకు వెళ్ళగల మరో నాయకుడు ఎవరు లేరనే అభిప్రాయం చాలామంది తెలుగుదేశం పార్టీ నాయకుల్లో ఉంది.

అంతేకాదు చంద్రబాబు రాజకీయ వారసుడిగా లోకేష్ ఉన్నా, ఆయన పనితీరుపై ఎవరికి నమ్మకం లేకపోవడంతో జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడే పార్టీని విజయవంతంగా ముందుకు తీసుకువెళ్ళగలరు అనే అభిప్రాయం అందరిలోనూ ఉంది.

Telugu Chandrababu, Hari Krishna, Lokesh, Sr Ntr, Tdp, Tdp Ntr-Political

ఇక బలమైన రాజకీయ ప్రత్యర్ధిగా ఉన్న జగన్ ను ఎదుర్కోవాలంటే జూనియర్ ఎన్టీఆర్ మళ్లీ యాక్టివ్ చేయాలనే అభిప్రాయం చంద్రబాబులోనూ ఉండదట.అందుకే కొద్దిరోజులుగా జూనియర్ ఎన్టీఆర్ ను ప్రసన్నం చేసుకునేందుకు టిడిపి నాయకులంతా ప్రయత్నాలు చేస్తున్నారు .కొద్ది రోజుల క్రితం జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా టీడీపీ శ్రేణులు అంతా ఆయనకు పెద్దఎత్తున అభినందనలు తెలిపారు.నారా లోకేష్ సైతం ఎన్టీఆర్ కు శుభాకాంక్షలు తెలిపారు.

ఒక్కసారిగా టీడీపీ శ్రేణుల్లో అనూహ్యమైన మార్పు రావడం జూనియర్ ఎన్టీఆర్ ను ప్రసన్నం చేసుకునే విధంగా ప్రయత్నించడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.ఎన్టీఆర్ వంటి చరిష్మా ఉన్న నాయకుడు అవసరం ఇప్పుడు టీడీపీకి వచ్చి పడింది.

Telugu Chandrababu, Hari Krishna, Lokesh, Sr Ntr, Tdp, Tdp Ntr-Political

పార్టీ పగ్గాలు పూర్తిగా కట్టబెట్టకపోయినా, అసలు జూనియర్ ఎన్టీఆర్ అంటూ పార్టీలోకి మళ్లీ యాక్టివ్ అయితే రాజకీయంగా తిరుగు ఉండదు అనేది టిడిపి పెద్దల ఆలోచన.అయితే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం టీడీపీలో మళ్లీ యాక్టివ్ అయ్యేందుకు ఆసక్తి చూపించడం లేదు.2009 ఎన్నికల్లో తాను పార్టీ విజయం కోసం ప్రచారం చేసినా ఆ తరువాత తనను పక్కన పెట్టేశారు అని, అలాగే తన తండ్రి హరికృష్ణ కు తెలుగుదేశం పార్టీలో ఘోర అవమానం జరిగింది అనేది జూనియర్ ఎన్టీఆర్ బాధ.ఆ బాధతోనే టీడీపీలో యాక్టివ్ అయ్యేందుకు ఆయన ఇష్టపడడం లేదట.అదీ కాకుండా చంద్రబాబు రాజకీయ ఎత్తుగడల గురించి ఎన్టీఆర్ కు బాగా తెలుసు .అందుకే వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అన్నట్లుగా ఆయన వ్యవహరిస్తున్నట్లుగా ప్రస్తుత పరిస్థితులు కనిపిస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube