పెళ్లి చూపులు దర్శకుడుతో ఎన్టీఆర్ సినిమా

పెళ్లి చూపులు సినిమాతో టాలీవుడ్ లో అందరి దృష్టిని తన వైపుకి తిప్పుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్.మొదటి సినిమాతో సూపర్ హిట్ ని ఖాతాలో వేసుకొని డిఫరెంట్ కంటెంట్ తో నేటి జెనరేషన్ కి కనెక్ట్ అయ్యే కథాంశంతో మెప్పించిన తరుణ్ భాస్కర్ మరల రెండేళ్ళ గ్యాప్ తర్వాత ఈ నగరానికి ఏమైంది అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు.

 Ntr Ready To Act In Tarun Bhaskar Direction, Tollywood, Rrr Movie, Telugu Cinema-TeluguStop.com

ఈ సినిమా పరవాలేదనిపించుకుంది.తరువాత విజయ్ దేవరకొండ ప్రొడక్షన్ లో హీరోగా ట్రై చేశాడు.

ఇప్పుడు వెంకటేష్ తో సినిమా కోసం రెడీ అవుతున్నాడు.ఈ సినిమా త్వరలో పట్టాలు ఎక్కే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే తాజాగా తరుణ్ భాస్కర్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాన్ని షేర్ చేసుకున్నాడు.

రీసెంట్ గా జూనియర్ ఎన్టీఆర్ ని ఒక ఒకత వినిపించడం జరిగిందని, ఇక ఎన్టీఆర్ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే ఆ కథకి బౌండ్ స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో ఉంటానని చెప్పాడు.

ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాలో ఉన్న ఎన్టీఆర్ తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు.ఇక ఈ సినిమా తర్వాత తరుణ్ భాస్కర్ తో సినిమా చేస్తాడనే టాక్ అప్పుడే మొదలైంది.

నిజానికి తరుణ్ కథలు అన్ని కూడా యూత్ కంటెంట్ తో చాలా సింపుల్ గా ఉంటాయి.ఎన్టీఆర్ ఇమేజ్ పరంగా చూసుకుంటే కమర్షియల్ కథలు అయితే వర్క్ అవుట్ అవుతాయి.

మరి ఇలాంటి పరిస్థితిలో డిఫరెంట్ కంటెంట్ కథలు రాసుకునే తరుణ్ భాస్కర్ కి ఎలా గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు అనే ప్రశ్న కూడా వస్తుంది.అయితే ఎన్టీఆర్ కెరియర్ లో ఇప్పటి వరకు కమర్షియల్ జోనర్ సినిమాలే ఎక్కువగా చేశాడు.

ఈ నేపధ్యంలో డిఫరెంట్ కంటెంట్ తో ఒక సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు.ఈ నేపధ్యంలో తరుణ్ భాస్కర్ కథకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి అవకాశం ఉందని కూడా మాట్లాడుకుంటున్నారు.

మరి వీటిలో ఏది వాస్తవం అవుతుంది అనేది అఫీషియల్ గా కన్ఫర్మ్ అయ్యేంత వరకు వేచి చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube