నాకు దమ్ములేదు..ఆ అర్హత నీకు మాత్రమే ఉంది

తెలుగు సినిమా పరిశ్రమ దిగ్గజాల్లో ఒక్కరైన నందమూరి తారక రామారావు నట వారసులుగా ఎంతో మంది ప్రేక్షకుల ముందుకు వచ్చారు.అయితే సీనియర్‌ నట వారసుడు ఎవరు అని చిన్న పిల్లాడిని ప్రశ్నించినా కూడా జూనియర్‌ ఎన్టీఆర్‌ అనే సమాధానం ఠక్కువ వస్తుందనడంలో సందేహం లేదు.

 Ntr Superb Speech At Mahanati Movie Audio-TeluguStop.com

బాలకృష్ణ కంటే కూడా అధికంగా ఎన్టీఆర్‌ క్రేజ్‌ ఉంది.అయినా కూడా తాతగారిపై గౌరవంతో ఎన్టీఆర్‌ ఆయన పాత్రలను చేసేంత సత్తా, ధైర్యం నాకు లేదు అంటూ ఉంటాడు.

తాజాగా ‘మహానటి’ చిత్రం కోసం ఎన్టీఆర్‌ పాత్రకు గాను ఎన్టీఆర్‌ను సంప్రదించేందుకు నిర్మాత స్వప్న వెళ్లారట.ఆ సమయంలో ఎన్టీఆర్‌ సున్నితంగా తిరష్కరించినట్లుగా తెలుస్తోంది.

‘మహానటి’ ఆడియో వేడుక కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎన్టీఆర్‌ ఆ విషయం గురించి మాట్లాడుతూ.‘మహానటి’ వంటి అద్బుతమైన చిత్రంలో నటించిన ప్రతి ఒక్కరిని నా హ్యాట్సాప్‌.అద్బుతమైన టీంతో ఈ చిత్రం తెరకెక్కింది.నిజంగా ఒక మహా మనిషి గురించి ఈ చిత్రంలో చూపిస్తున్నారు.ఈ చిత్రంలో తాతగారిగా చిన్న పాత్రలో నటించాల్సిందిగా స్వప్న రిక్వెస్ట్‌ చేసింది.కాని తాను అందుకు అర్హుడిని కాదు అంటూ నో చెప్పాడు.

ఆయన పాత్ర చేయాలంటే తన అనుభవం సరిపోదని, ఆయనగా నేను మెప్పించలేను అంటూ ఎన్టీఆర్‌ చెప్పుకొచ్చాడు.

సీనియర్‌ ఎన్టీఆర్‌ పాత్ర చేయడానికి పూర్తి అర్హత కలిగి ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది ఖచ్చితంగా జూనియర్‌ ఎన్టీఆర్‌ మాత్రమే అని, ఆ అర్హత ఆయనకు తప్ప మరెవ్వరికి లేదు అంటూ నందమూరి అభిమానులు అంటున్నారు.

నాకు ఆ అర్హత లేదు అంటూ జూనియర్‌ తన గొప్పదనంను చాటుకుంటున్నాడు.కాని ఎన్టీఆర్‌ మనవడిగా ఆయనకు పూర్తి అర్హత ఉందని అభిమానులు నమ్మకంగా చెబుతున్నారు.ప్రస్తుతం తెరకెక్కుతున్న ‘ఎన్టీఆర్‌’ బయోపిక్‌ చిత్రాన్ని చేసే అర్హత కూడా జూనియర్‌కే ఉందని, బాయ్య కంటే కూడా ఎన్టీఆర్‌ పాత్రను జూనియర్‌ ఎన్టీఆర్‌ చేయగలడు అంటూ అభిమానులు నమ్మకంగా చెబుతున్నారు.

‘మహానటి’ చిత్రంలో ఎన్టీఆర్‌ పాత్ర కోసం జూనియర్‌ ఎన్టీఆర్‌ను సంప్రదించగా ఆయన నో చెప్పడంతో ఆ పాత్రకు ఎవరిని తీసుకున్నారనేది ప్రస్తుతం ఆసక్తికర విషయం.

మరో లెజెండ్‌ నటుడు అయిన ఏయన్నార్‌ పాత్రలో నాగచైతన్య నటించినట్లుగా తెలుస్తోంది.ఎస్వీఆర్‌ పాత్రను మోహన్‌బాబు పోషించాడు.అద్బుతమైన నటీనటులు ఈ చిత్రంలో ఉన్నారు.తప్పకుండా ఇదో మంచి సినిమా అవుతుందనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు.

ఈనె 9న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘మహానటి’ కీర్తి సురేష్‌, సమంత కెరీర్‌లో బెస్ట్‌ సినిమాగా మిగిలి పోతుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube