గోపీచంద్ దగ్గరకు ఎన్టీఆర్ కథ..!

కోలీవుడ్ లో మాస్ డైరక్టర్ గా పేరు తెచ్చుకున్న హరి కోలీవుడ్ లో ఈమధ్య ఫాం కోల్పోయాడు.సింగం స్రీస్ లతో బాగా ఫేమస్ అయిన హరి రీసెంట్ గా అరుణ్ విజయ్ హీరోగా వచ్చిన ఏనుగు సినిమాని డైర్క్ట్ చేశారు.

 Ntr Story For Gopichand Singham Director Hari Telugu Movie, Arun Vijay, Director Hari, Enugu, Gopichand, Hari, Movie Ews, Ntr, Tolllywood-TeluguStop.com

ఈ సినిమాను తమిళంతో పాటుగా తెలుగులో కూడా రిలీజ్ చేశారు.అయితే హరి సినిమాలకు టాలీవుడ్ లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది.

విక్రం తో ఆయన తీసిన సామి సినిమా తెలుగులో నందమూరి బాలకృష్ణ లక్ష్మి నరసింహాగా రీమేక్ చేశారు.ఆ సినిమా ఇక్కడ సూపర్ హిట్ అయ్యింది.

 NTR Story For Gopichand Singham Director Hari Telugu Movie, Arun Vijay, Director Hari, Enugu, Gopichand, Hari, Movie Ews, Ntr, Tolllywood-గోపీచంద్ దగ్గరకు ఎన్టీఆర్ కథ..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక సింగం సినిమాల సీక్వల్స్ గురించి తెలిసిందే. సింగం ని తెలుగులో యముడు గా రిలీజ్ చేశారు.సూర్యకు తెలుగులో కూడా ఫ్యాన్ బేస్ ఉండటం వల్ల సూర్య సినిమాలను డైరెక్ట్ గా తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు.సింగం, సింగం 2 సినిమాలు తెలుగులో మంచి విజయాన్ని అందుకున్నాయి.

సింగం 3 కూడా అదే బాటలో సక్సెస్ అందుకుంది.ఇదిలాఉంటే హరి డైరక్షన్ లో మన తెలుగు హీరో మ్యాచో స్టార్ గోపీచంద్ ఓ సినిమా చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి.

హరి అసలైతే ఆ కథని యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కోసం రాసుకున్నారట.అయితే తారక్ ప్రస్తుతం మాస్ యాక్షన్ కథలని పక్కన పెట్టి పాన్ ఇండియా సినిమాలకే ఓటు వేస్తున్నారు.ఆర్.ఆర్.ఆర్ తర్వాత ఎన్.టి.ఆర్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు.కాబట్టి ఇక మీదట తను తీసే సినిమాలన్ని పాన్ ఇండియా అటెంప్ట్ చేస్తాడని తెలుస్తుంది.

ఆల్రెడీ కొరటాల శివ డైరక్షన్ లో వస్తున్న సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు.

మరి ఎన్.టి.ఆర్ కోసం రాసుకున్న కథతో హరి గోపీచంద్ కాంబో సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.తప్పకుండా హరి తో గోపీచంద్ మూవీ సెన్సేషనల్ అవుతుందని చెప్పొచ్చు.ప్రస్తుతం ఈ కాంబో టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube