అభిమాన సంఘాలకు ఎన్టీఆర్‌ మెసేజ్‌లు.. మంచి నిర్ణయం

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ పుట్టిన రోజు వేడుకలకు మరి కొన్ని గంటలే సమయం ఉంది.ఎన్టీఆర్‌ పుట్టిన రోజుకు అభిమానులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.

 Ntr Special Message For His Fans-TeluguStop.com

సోషల్‌ మీడియాలో ట్రెండ్డింగ్‌ ను మొదలుకుని కరోనా రోగులకు ఆహారం అందించే వరకు ఎన్నో కార్యక్రమాలు ప్లాన్‌ చేసుకున్నారు.అభిమానులు రోజంతా కూడా సందడి చేసేందుకు సిద్దంగా ఉన్నారు.

ఈ సమయంలో ఎన్టీఆర్‌ నుండి అభిమానులకు కీలక మెసేజ్ వచ్చినట్లుగా సమాచారం అందుతోంది.అభిమాన సంఘం నాయకులకు మరియు ముఖ్యమైన అభిమానులకు ఎన్టీఆర్‌ సన్నిహితులకు ఆ మెసేజ్‌ చేరిందట.

 Ntr Special Message For His Fans-అభిమాన సంఘాలకు ఎన్టీఆర్‌ మెసేజ్‌లు.. మంచి నిర్ణయం-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇంతకు ఆ మెసేజ్‌ లో ఏముందంటే కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఏ ఒక్కరు కూడా బర్త్‌ డే వేడుకలు అంటూ కేకులు కట్‌ చేయడం కాని ప్లెక్సీలు కట్టడం కాని చేయవద్దంటూ విజ్ఞప్తి చేశాడు.కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన తర్వాత వచ్చే బర్త్‌ డే వేడుకలను ఘనంగా జరుపుకోవచ్చు అంటూ ఎన్టీఆర్‌ ఆ మెసేజ్ లో సూచించాడట.

ఎన్టీఆర్ నిర్ణయాన్ని అంతా అభినందిస్తున్నారు.నిజంగా ఇది మంచి నిర్ణయం.ప్రతి ఒక్క హీరో కూడా తమ అభిమానులు బయటకు వెళ్లకుండా ఈ సమయంలో ఇంటికే పరిమితం అవ్వాలంటూ సూచించాలి.అలా సూచించడం వల్ల అనవసర వేడుకలు అంటూ బయట అభిమానులు తిరిగి కరోనా బారిన పడి ప్రాణాల మీదకు తెచ్చుకోరు అంటూ అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

ఎన్టీఆర్‌ బయట వేడుకలు వద్దన్ని సూచించడంతో అభిమానులు ఆ విధంగానే ప్లాన్‌ చేస్తున్నారు.ఎక్కడికి అక్కడ అభిమానులు సోషల్‌ మీడియా ద్వారా ఎన్టీఆర్‌ బర్త్‌ డే వేడుకను పండుగ మాదిరిగా జరుపుకోవాలని భావిస్తున్నారట.

అందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి.ఇక ఎన్టీఆర్‌ బర్త్‌ డే సందర్బంగా రేపు ఆర్‌ ఆర్‌ ఆర్‌ సినిమా నుండి కొత్త పోస్టర్ ను విడుదల చేసే అవకాశం ఉంది.

దాంతో పాటు కొత్త విడుదల తేదీని కూడా ప్రకటిస్తారని అంటున్నారు.మరో వైపు కొరటాల శివ దర్శకత్వంలో సినిమా కు సంబంధించిన అప్ డేట్‌ కూడా వచ్చే అవకాశం ఉందంటున్నారు.

#NTRSpecial #NTRSpecial #NTR Birthday #Ntr Fans #RRRMovie

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు