అందుకు రెమ్యూనరేషన్ వద్దన్న ఎన్టీఆర్..?

ఎన్టీఆర్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.నటనకు, డ్యాన్స్ కు కేరాఫ్ అడ్రెస్స్ జూనియర్ ఎన్టీఆర్.

 Ntr Signed For A Talkshow Without Remunaration , Ntr, Talk Show, Without Remunar-TeluguStop.com

నందమూరి వారసుడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయినా ఎంతో కష్టపడి తన ట్యాలెంట్ తో తెలుగు రాష్ట్రాల ప్రజలను తన అభిమానులుగా సొంతం చేసుకున్నాడు.ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్నాడు.

ఇక అలాంటి ఎన్టీఆర్ త్వరలోనే ఓ టీవీ షో చెయ్యనున్నాడని వార్తలు వచ్చాయ్.ఇప్పటికే స్టార్ మాలో ప్రసారం అయినా బిగ్ బాస్ సీజన్ 1 ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించి షోని సక్సెస్ ఫుల్ చేశాడు.

ఇక ఇప్పుడు మరో షోతో బుల్లితెర ప్రేక్షకులను అలరించనున్నాడు.అయితే ఈ టాక్ షో జెమినీ టీవిలో ప్రసారం కానుంది.ఈ షో మీలో ఎవరు కోటీశ్వరుడు షో కు దగ్గరగా ఉంటుందని సమాచారం.అయితే ఈ టాక్ షో కు ఎన్టీఆర్ రెమ్యూనరేషన్ తీసుకోవట్లేదని సోషల్ మీడియాలో ప్రచారం అవుతుంది.

Telugu Ntr Show, Show-Latest News - Telugu

మరోవైపు.రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు.అది కూడా ‘ఎపిసోడ్’కి 30 లక్షలు తీసుకుంటున్నట్టు మరోవైపు ప్రచారం జరిగింది.60 ఎపిసోడ్లు ఉన్న ఈ టాక్ షో పూర్తయ్యే సమయానికి ఏకంగా 18 కోట్ల రూపాయిలు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతుంది.ఎపిసోడ్ కి 30 లక్షల రూపాయిలు రెమ్యూనరేషన్ ఇచ్చుకోలేం అని ఛానెల్ వాళ్ళు చేతులు ఎత్తెయ్యడంతో ఎన్టీఆర్ ఏ స్వయంగా ఈ షో ని నిర్మిస్తా అని ముందుకు వచ్చినట్టు సమాచారం.కాగా ఎన్టీఆర్ ఆ షో ని చెయ్యాలి అంటే మరో రెండు నెలల సమయం పడుతుంది.

ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో ఉన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube