ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు ప్రోమో విడుదల.. ఆ లుక్ లో ఎన్టీఆర్..?

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్ దాదాపు 80 శాతం మేరకు పూర్తి అయ్యింది.

 Ntr Show Evaru Meelo Koteeswarudu Promo Released-TeluguStop.com

ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ వరస పెట్టి సినిమాలు లైన్లో పెట్టాడు.అయితే తాజాగా జెమినీ టీవీ ఎవరు మీలో కోటీశ్వరులు అంటూ ఒక ప్రోమోను రిలీజ్ చేసారు.

ఇంతకముందు మాటీవీ వారు మీలో ఎవరు కోటీశ్వరుడు పేరుతో షో మొదలు పెట్టారు.

 Ntr Show Evaru Meelo Koteeswarudu Promo Released-ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు ప్రోమో విడుదల.. ఆ లుక్ లో ఎన్టీఆర్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఇప్పుడు ఆ షో టైటిల్ ను కొద్దిగా మార్పు చేసి ఎవరు మీలో కోటీశ్వరుడు అని ఒక కొత్త టైటిల్ ను విడుదల చేసారు.

తాజాగా జెమినీ టీవీ వారు ట్విట్టర్లో ఎవరు మీలో కోటీశ్వరులు అంటూ ఒక ప్రోమో ను పెట్టారు.ఈ షో ప్రపంచ వ్యాప్తంగా మంచి ఆదరణ పొందింది.

ఇప్పటికే 120 భాషల్లో ఈ షో ప్రసారమయ్యింది.హిందీలో కౌన్ బనేగా కరోడ్‌పతీ పేరుతో ప్రసారం అయ్యింది.

ఈ షో మాటీవీ లో ప్రసారం అయ్యింది.ఇప్పటికే నాలుగు సీజన్స్ పూర్తి చేసుకుంది.మొదటి మూడు సీజన్స్ కు నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తే నాల్గవ సీజన్ కు చిరంజీవి హోస్ట్ గా చేసారు.ఈ షో తెలుగులో మంచి సక్సెస్ అయ్యింది.

ఇప్పుడు ఐదవ సీజన్ జెమిని టీవిలో ప్రసారం అవుతుంది.జెమిని టీవీ ప్రోమో విడుదల చేస్తూ ఈ షో మీ జీవితాన్ని మార్చే గేమ్ షో.మీ కలలను నిజం చేసే షో.త్వరలో మీ ముందుకు రాబోతుంది.అంటూ ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు.

అయితే ఈ ప్రోమోలో జెమినీ టీవీ ఎవరు మీలో కోటీశ్వరుడు ప్రస్థానం గురించి వివరించారు.

ప్రోమో చివర్లో టైటిల్ పాడినప్పుడు కుర్చీలో కూర్చున్న వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్ అని ఇప్పటికే అందరికి అర్ధం అయ్యింది.ఇప్పటికే ఎన్టీఆర్ బిగ్ బాస్ షో తో హోస్ట్ గా అదరగొట్టారు.

చూడాలి మరి ఈ షో తో ఎన్ని టీఆర్పిలు బద్దలవుతాయో.అయితే ఈ షో గురించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

#EvaruMeelo #Gemini TV #Social Media #EvaruMeelo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు