దసరా పోటిలో ఎన్టీఆర్ కి లాభం – మహేష్ కి నష్టం … ఎలానో చూడండి     2017-09-20   02:21:55  IST  Raghu V

-

-

దసరా ఇంత సందడిగా చివరిసారిగా ఎప్పుడు ఉండిందో గుర్తుకు కూడా రావడం లేదు. రెండు పెద్ద సినిమాలు, ఇద్దరు అగ్రహీరోల ఇలా ఈమధ్యకాలంలో పోటిపడలేదు. పండగ సీజన్ కాబట్టి ఇద్దరు పోటికి వస్తున్నారు. సెలవులు ఇద్దరికి కావాలి. మరి ఈ పోటి వలన నష్టపోయేది ఎవరు? లాభపడేది ఎవరు? తరాజు ప్రస్తుతానికి ఎవరి బరువు ఎక్కువ చూపిస్తోంది? ఓ చిన్న విశ్లేషణ చూడండి.

నిస్సందేహంగా ఈ పోటి వాన నష్టపోయేది మహేష్ బాబే. ఎలా అంటారా? నైజాంలో ఎన్టీఆర్ మార్కెట్ తో పోల్చుకుంటే మహేష్ మార్కెట్ పెద్దది. ఒక్కడు నుంచి మొదలు, నైజాంలో మహేష్ రికార్డులు కొట్టడం ఓ సర్వసాధారణ విషయం. మరి ఈ దసరా పోటిలో నైజాం ఏరియాని తీసుకుంటే జై లవ కుశకి ఏకంగా 400 కి పైగా థియేటర్లు దొరుకుతున్నాయి. బాహుబలి తరువాత ఓ సినిమా నైజాంలో 400 థియేటర్స్ లో విడుడా అవడం ఇదే మొదటిసారి. హైదరబాద్ లో మొదటి రోజు మల్టిప్ప్లేక్స్ షోల కౌంట్ కూడా 400 దాటుతోంది. బాహుబలి తరువాత జై లవ కుశ విషయంలోనే ఇలా జరుగుతోంది. ఉత్తరాంధ్రలో బాహుబలిని మించే రిలీజ్ ఉండబోతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఇంచు మించుగా బాహుబలి విడుదల ఈ సినిమాకి దక్కబోతోంది. అంటే ఓపెనింగ్స్ రికార్డు స్థాయిల్లో ఉండబోతున్నాయి.

మరోవైపు మహేష్ కి ఓపెనింగ్ రికార్డులు కష్టం ఈసారి. నైజాంలో ఎక్కువ మార్కెట్ ఉన్నా, జై లవ కుశ ఉండటం వలన రికార్డు రిలీజ్ స్పైడర్ కి దొరకదు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా కూడా స్పైడర్ కి రికార్డు రిలీజ్ దొరకదు. అన్నిచోట్లా జై లవ కుశతో స్క్రీన్స్ పంచుకోవాల్సిందే. ముందు రావడం వలన జైలవకుశ లాభంలో పడితే, స్పైడర్ నష్టంలో పడింది. మహేష్ కి రికార్డు రిలీజ్ దక్కేది తెలుగు రాష్ట్రాల బయటే. లేటుగా వస్తున్నా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఉత్తరభారతం, ముఖ్యంగా ఓవర్సీస్, ఇలా తెలుగు రాష్ట్రాల బయట మాత్రం మహేష్ ఓపెనింగ్స్ అదరగొట్టేస్తాడు. కాని తెలుగు రాష్ట్రాల ఓపెనింగ్ వాటికన్నా ముఖ్యం. పై కారణాల వలన ఎన్టీఆర్ లోకల్ లో మాత్రం డామినేట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది..

మొదటిరోజు స్పైడర్ కి ఎన్నేసి థియేటర్లు దొరుకుతాయి అనేది జై లవ కుశ ఫలితాన్ని బట్టి ఉంటుంది. ఎన్టీఆర్ సినిమాకి యావరేజ్ టాక్ వచ్చినా, ఓపెనింగ్ రికార్డుల మీద ఆశలు వదులుకోవాల్సిందే మహేష్ బాబు ఫ్యాన్స్.