అన్నపై సీరియస్ అయిన ఎన్టీఆర్.. కారణమేమిటంటే..?

దాదాపు రెండు దశాబ్దాలుగా హీరోగా ఇండస్ట్రీలో ఉన్నా అతనొక్కడే, పటాస్ సినిమాలు మినహా కెరీర్ లో సరైన హిట్లు లేకపోవడంతో కళ్యాణ్ రామ్ మార్కెట్ ఎంతో డిస్ట్రిబ్యూటర్లకు, ప్రేక్షకులకు అర్థం కావడం లేదు.టాలెంట్ పుష్కలంగా ఉన్న నటుడైనప్పటికీ కథల ఎంపికలో లోపాల వల్ల కళ్యాణ్ రామ్ సినిమాలు ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోవడం లేదు.

 Jr Ntr Listening Stories For His Brother Kalyan Ram , Kalyan Ram, Blockbuster Hi-TeluguStop.com

దీంతో అన్న కెరీర్ పై జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టారని సమాచారం.

నిర్మాతగా పలు సినిమాల ద్వారా నష్టపోయిన కళ్యాణ్ రామ్ కు జై లవకుశ సినిమా నిర్మించే అవకాశం ఇచ్చి ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ నష్టాలను భర్తీ చేశారని గతంలో వార్తలు వచ్చాయి.

ప్రస్తుతం కెరీర్ విషయంలో దృష్టి పెట్టమని ఏవైనా కథలు నచ్చితే తాను కథలు విన్న తరువాతే ఆ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని ఎన్టీఆర్ అన్నకు సీరియస్ గా సూచించారని సమాచారం.వరుస ఫ్లాపుల తర్వాత టెంపర్ సినిమా నుంచి సక్సెస్ ట్రాక్ ఎక్కిన ఎన్టీఆర్ అన్న కళ్యాణ్ రామ్ కు కూడా వరుస విజయాలు దక్కేలా చేయాలని భావిస్తున్నారు.
కళ్యాణ్ రామ్ సరైన కథలను ఎంచుకోకపోవడం వల్లే నష్టపోతున్నాడని ఎన్టీఆర్ ఫీల్ అవుతున్నారని సమాచారం.తనకు కథ చెప్పిన దర్శకుల్లో ఏ కథైనా అన్నకు సూట్ అవుతుందని భావిస్తే ఆ కథ కళ్యాణ్ రామ్ కు చెప్పమని ఎన్టీఆర్ దర్శకులకు సూచిస్తున్నారని తెలుస్తోంది.

కళ్యాణ్ రామ్ కు భారీ బ్లాక్ బస్టర్ హిట్లు దక్కేలా జూనియర్ ఎన్టీఆర్ అన్న విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని ఫిల్మ్ నగర వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

అందువల్లే కళ్యాణ్ రామ్ నుంచి ఈ మధ్య కాలంలో కొత్త సినిమా ప్రకటనలు వెలువడటం లేదని తెలుస్తోంది.

కొంచెం ఆలస్యంగా వచ్చినా ఇకపై హిట్లు వచ్చేలా కళ్యాణ్ రామ్ కూడా కెరీర్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube